Virat Kohli: న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ.. కొత్త హెయిర్ స్టైల్ చూశారా..!

Virat Kohli New Hair Style: ఐపీఎల్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ న్యూ లుక్‌లోకి మారిపోయాడు. సరికొత్త హెయిర్ స్టైల్‌లో ఉన్న పిక్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ పిక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌ అలీమ్ హకీమ్ షేర్ చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 11:46 AM IST
Virat Kohli: న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ.. కొత్త హెయిర్ స్టైల్ చూశారా..!

Virat Kohli New Hair Style: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. మార్చి 31 నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ఆరంభం అవుతుంది. ఇప్పటికే అన్ని టీమ్‌లు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఈ గ్రాండ్ లీగ్ ఆఫ్ క్రికెట్‌కు ముందు.. టీమిండియా రన్‌మెషీన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఐపీఎల్‌కు ముందే కోహ్లీ జుట్టు కత్తిరించుకున న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్‌లో కనిపించనున్నాడు . ఆర్‌సీబీ క్యాంపులో చేరడానికి ముందే తన జుట్టును కత్తిరించుకున్నాడు. కొత్త హెయిర్ స్టైల్ ఫోటో క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్‌తో కలిసి విరాట్‌ పిక్ తీసుకున్నాడు. ఈ పిక్‌ను అలీమ్ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు.

కోహ్లీకి ఈ కొత్త రూపాన్ని అందించిన అలీమ్ హకీమ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. అలీమ్ చాలా మంది సెలబ్రిటీలకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అలీమ్ బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీకి సూపర్ హెయిర్ స్టైల్ సెట్ చేయడంపై అభిమానులు అలీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.

 

 
 
 
 
 

ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అద్భుత ఆటతీరుతో పాత కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు. విరాట్ ఫామ్ చూస్తుంటే.. ఈసారి ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆర్‌సీబీ జట్టు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, డుప్లెసిస్ (కెప్టెన్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహిపాల్ లోమ్‌వుడ్ అలెన్, సుయాష్ ప్రభుదేశాయ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, డేవిడ్ విల్లీ, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, మనోజ్ భాంగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, సోను యాదవ్, మైఖేల్ బ్రేస్‌వెల్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న భారత క్రీడాకారుడు అయిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రూపాన్ని పొందాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డేలు మరియు టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ భారత్‌లో భాగంగా ఉన్నాడు. 34 ఏళ్ల బ్యాటర్ ప్రాణాంతక రూపంలో ఉన్నాడు మరియు ఆసియా కప్ 2022లో తన సెంచరీ డ్రాఫ్ట్‌ను ముగించాడు, ఆ తర్వాత కోహ్లీ ఆటలోని ప్రతి ఫార్మాట్‌లో తన సెంచరీని కొట్టాడు.

Also Read:  Ajith Father Death : తలా ఇంట్లో విషాదం.. అజిత్ తండ్రి మరణం

Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News