Sania Mirza Second Marriage: టీమిండియా స్టార్‌ బౌలర్‌తో సానియా మీర్జా రెండో పెళ్లి.. ఆ ప్లేయర్ ఎవరంటే..?

Mohammed Shami And Sania Mirza Wedding News: మాజీ టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాలిక్ ఇప్పటికే పాకిస్థానీ నటి సనా జావేద్‌ మరో వివాహం చేసుకోగా.. తాజాగా సానియా మీర్జా కూడా మరో వివాహానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.  
 

  • Jun 06, 2024, 19:35 PM IST
1 /5

ఏడాది కాలంగా సానియా, మాలిక్ వీడిపోతున్నారని రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను డీలిట్ చేసి.. ఆ తరువాత అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు.  

2 /5

మాలిక్‌తో విడాకులు తీసుకున్న సానియా మీర్జా.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీతో పెళ్లికి సిద్ధమయ్యారని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.   

3 /5

ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి దుస్తులలో ఉన్నారు.  

4 /5

ఈ ఫోటోను ఎడిట్ చేసి కొందరూ వైరల్ చేశారు. సానియా-మాలిక్ పెళ్లి ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  

5 /5

మరో పిక్‌ను కూడా ఎడిట్ చేసి.. అందులో ఏకంగా పెళ్లి చేసేశారు. ఈ పిక్స్‌పై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.