SRH vs KKR: టాస్‌ నెగ్గిన కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక మార్పులు! తుది జట్లు ఇవే

Kolkata Knight Riders have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : May 4, 2023, 07:46 PM IST
SRH vs KKR: టాస్‌ నెగ్గిన కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక మార్పులు! తుది జట్లు ఇవే

SRH vs KKR Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌ మొదలుకానుంది. టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్‌ రాణా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జాసన్ రాయ్, వైభవ్ అరోరా తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు హైదరాబాద్‌ కూడా తుది జట్టులో మార్పులు చేసింది. 

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌  కేకేఆర్‌పైనే (228) భారీ స్కోరు చేసి గెలిచింది. మరోసారి ఆ రేంజ్‌లో విజృంభించాలని హైదరాబాద్‌ చూస్తోంది. మరోవైపు కోల్‌కతా ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. మరి ఈ మ్యాచులో ఎవరి ఆధిక్యం నడుస్తుందో చూడాలి. 

తుది జట్లు ఇవే:
హైదరాబాద్‌ సన్‌రైజర్లు: మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, మార్‌క్రమ్‌ (కెప్టెన్), హెన్రిచ్‌ క్లాసెన్‌ (కీపర్‌), హ్యారీ బ్రూక్‌, అబ్దుల్‌ సమద్‌, మార్కో జాన్‌సేన్‌, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, కార్తీక్‌ త్యాగి, నటరాజన్‌.
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: రహ్మనుల్లా గుర్బాజ్‌ (కీపర్‌), జేసన్‌ రాయ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా (కెప్టెన్‌), ఆండ్రూ రస్సెల్‌, రింకూ సింగ్‌, సునీల్‌ నరైన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.

ఇంపాక్ట్‌ ప్లేయర్లు:
కోల్‌కతా: సుయాష్‌ శర్మ, అనుకుల్‌ రాయ్‌, జగదీశన్‌, ఫర్గూసన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా. 
 సన్‌రైజర్స్‌: రాహుల్‌ త్రిపాఠి, వివ్రంత్‌ శర్మ, గ్లెన్‌ ఫిలిప్స్‌, నితీశ్‌ రెడ్డి, శాన్వీర్‌ సింగ్‌. 

Also Read: Hyundai Casper Launch 2023: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో.. చిన్న ఎస్‌యూవీని విడుదల చేసిన హ్యుందాయ్! ధర చాలా ఎక్కువ

Also Read: Vida Scooter Price Cut 2023: శుభవార్త చెప్పిన హీరో మోటోకార్ప్‌.. తగ్గిన విడా స్కూటర్ల ధరలు! ఏకంగా 25 వేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News