Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

Mumbai Indians Captain Rohit Sharma says Rajasthan Royals Batter Yashasvi Jaiswal played very well. ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి  జైశ్వాల్‌ ఆటకు ఫిదా అయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 1, 2023, 02:05 PM IST
Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

Mumbai Indians Captain Rohit Sharma says Rajasthan Royals Batter Yashasvi Jaiswal played very well: ఐపీఎల్‌ 2023లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇనింగ్స్ ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే 53 బంతుల్లోనే యశస్వి సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. రాజస్తాన్‌ యువ ఓపెనర్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా జైశ్వాల్‌ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. చివరకు అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. యశస్వి సెంచరీ చేయడంతో రాజస్థాన్ స్కోర్ 200 దాటింది. 

ఐపీఎల్‌ కెరీర్‌లో యశస్వి జైశ్వాల్‌కు ఇదే తొలి సెంచరీ. దీంతో జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న జైశ్వాల్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని ఫాన్స్, మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ కూడా జైశ్వాల్‌ ఆటకు ఫిదా అయ్యాడు. జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. అతడి ప్రదర్శనను గతే సీజన్‌లోనే చూశానని, ఈసారి థన్ ఆటను మరో లెవల్లోకి తీసుకెళ్లాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. 

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... 'భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గత మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు ఛేజ్ చేసే వరకు వచ్చి.. చివర్లో తడబడ్డాం. ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాటు చేయలేదు. కిరన్ పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. చాలా సంవత్సరాలు మాకు ఛాంపియన్‌షిప్‌లను ఇచ్చాడు. కానీ టిమ్ డేవిడ్‌కు ఆ సత్తా ఉంది. టిమ్ బాగా ఆడాడు. చివరిలో మూడు సిక్సులు కొట్టడం అంత సులువేం కాదు. జట్టుగా సరళంగా ఉండాలనుకుంటున్నా. అబ్బాయిలు దేనికైనా సిద్ధంగా ఉండాలి. జోఫ్రాకు భారీ గాయం అయింది, చాలా కాలం పాటు అతడు ఆడలేదు. బౌలర్లకు ప్రాక్టీస్ మరియు రిథమ్ అవసరం. ఈ రోజు అతని నుంచి మంచి పేస్‌ వచ్చింది' అని అన్నాడు. 

'యశస్వి జైస్వాల్ ఆటను నేను గత సంవత్సరం చూశాను. ఈ సంవత్సరం అతను తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అంత శక్తి ఎక్కడ నుండి వస్తుందని నేను అతనిని అడిగాను. అందుకు తాను జిమ్‌లో సమయం గడుపుతున్నాన్నానని బదులిచ్చాడు. బంతిని బాగా టైమింగ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ తరహా క్రికెట్‌ ఆడుతుండడం రాజస్తాన్‌తో పాటు భారత క్రికెట్‌కు చాలా మంచిది' అని పోస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. రోహిత్‌ చేసిన వాఖ్యలు చూస్తే త్వరలోనే జైశ్వాల్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీలు త్వరితలోనే టీ20ల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. 

Also Read: IPL 2023 Points Table: రాజస్థాన్‌పై ముంబై విజయం.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు! టాప్‌లో గుజరాత్  

Also Read: Dimple Hayathi Pics: మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న డింపుల్ హయాతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News