MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ.. అదే కొట్టుడు.. ధోనీ సిక్స్ వీడియో వైరల్

MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ ఆడటానికి మిగిలి ఉంది కేవలం 7 బంతులే. అయితే, ఆ ఏడు బంతుల్లోనూ ఒక బంతిని ఫోర్ గా మలిచి బౌండరీకి పంపించిన ధోనీ.. మరో బంతిని సిక్సర్ షాట్ కొట్టాడు. ధోనీ కొట్టిన షాట్ కి ఆ బంతి కాస్తా ఎత్తులో ఎగురుతూ వెళ్లి స్టాండ్స్ లో పడింది. ధోనీ కొట్టిన ఈ సిక్సర్ చూసి అభిమానుల కేరింతలు అంతా ఇంతా కాదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 07:01 AM IST
MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ.. అదే కొట్టుడు.. ధోనీ సిక్స్ వీడియో వైరల్

MS Dhoni Hits Huge Six: క్రికెట్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపిఎల్ 2023 రానే వచ్చింది. అహ్మెదాబాద్ వేదికగా ఐపిఎల్ 2023 సమరం ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగలిగింది. అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ధోనీ అభిమానుల కళ్లన్నీ అతడిపైనే ఉన్నాయి. ధోనీ ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ కి వస్తాడా.. ఎప్పుడెప్పుడు ఆ మెరుపు ఇన్నింగ్స్ చూడొచ్చా అన్నట్టుగా అభిమానులు వేచిచూస్తుండగా ఇన్నింగ్స్ చివర్లో ధోనీ మైదానంలోకి ఎంటర్ అయ్యాడు.

అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఆడటానికి మిగిలి ఉంది కేవలం 7 బంతులే. అయితే, ఆ ఏడు బంతుల్లోనూ ఒక బంతిని ఫోర్ గా మలిచి బౌండరీకి పంపించిన ధోనీ.. మరో బంతిని సిక్సర్ షాట్ కొట్టాడు. ధోనీ కొట్టిన షాట్ కి ఆ బంతి కాస్తా ఎత్తులో ఎగురుతూ వెళ్లి స్టాండ్స్ లో పడింది. ధోనీ కొట్టిన ఈ సిక్సర్ చూసి అభిమానుల కేరింతలు అంతా ఇంతా కాదు. ఆ ఏడు బంతుల్లోనూ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి మొత్తం 14 పరుగులు రాబట్టాడు. ధోనీ కొట్టిన సిక్సర్ షాట్ వీడియో చూసిన జనం.. ధోనీలో దూకుడు ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

 

 

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చి మరోసారి క్రికెట్ ప్రియుల మనసు దోచుకున్నాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కే కాదు.. టీవీలకు అతుక్కుపోయిన ఆడియెన్స్‌కి కూడా మంచి వినోదాన్ని పంచాడు. అయితే, మ్యాచ్ ఫలితం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన పోరులో ఆఖరికి విజయం గుజరాత్ టైటాన్స్‌నే వరించింది. ఐపిఎల్ 2023 తొలి మ్యాచ్‌లో విజయం గుజరాత్ టైటాన్స్‌దే అయ్యింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్ పరుగుల వరద వృథానే అయింది. 

ఇది కూడా చదవండి : MS Dhoni Record: మరో 22 పరుగులే.. ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని అందుకోనున్న ఎంఎస్ ధోనీ!

ఇది కూడా చదవండి : MS Dhoni Impact Player: చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ప్లాన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ!

Trending News