Mi Batter Suryakumar Yadav React on 1st IPL Century: ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదిగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన గుజరాత్‌ను రషీద్ ఖాన్ (79 నాటౌట్; 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆదుకున్నాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ వీరవిహారం చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్; 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ముంబై 218 రన్స్ చేసింది.
ఈ మ్యాచులో మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే బౌండరీలతో రెచ్చిపోయాడు. స్కై దెబ్బకు గుజరాత్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. సూర్యకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు సాధించిన సూర్య.. ఇప్పుడు ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించడం ప్రత్యేకమేనని సూర్యకుమార్ తెలిపాడు. సెంచరీ అనంతరం సూర్యను బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ఓ ప్రశ్న అడిగాడు. అతడు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఐపీఎల్ తమ ట్విటర్లో పోస్టు చేసింది.
'నువ్వు సెంచరీ సాధించడం బాగుంది. మీ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది' అని మధ్వాల్ అడగ్గా... 'చాలా చాలా ఆనందంగా ఉంది. కుటుంబమంతా మైదానంలో మ్యాచ్‌ను వీక్షించింది. ముఖ్యంగా దేవీషా కూడా ఇక్కడే ఉంది. నేను చేసిన మూడు అంతర్జాతీయ సెంచరీలను నా సతీమణి చూడలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె చూస్తుండగానే సెంచరీ చేయడం మరింత సంతోషంగా ఉంది. నా సతీమణి ఉంటే మూడంకెల స్కోరు సాధించలేనని వ్యాఖ్యానించే వారికి.. ఇక నుంచి అలా అనేందుకు అవకాశం లేదు' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కంటే రషీద్ ఖాన్‌ను అత్యంత విలువైన ఆటగాడిగా (మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్) భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. 'ఈ మ్యాచ్‌లో అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కాదు. రషీద్ ఖాన్ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ అని నా అభిప్రాయం. గుజరాత్ టైటాన్స్ టాపర్డర్ బ్యాటర్లు కాస్త రాణించే ఉంటే.. రషీద్ ఒంటరిగా మ్యాచ్‌ను గెలిపించేవాడు. గుజరాత్ ఐదు వికెట్లు తీస్తే అందులో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మతో పాటు నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి' అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.