CSK Top In Points Table IPL: ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ ఇప్పటికే ముగిసింది. ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్లేందుకు అన్ని జట్లు కష్టపడుతున్నాయి. ఈ సారి ప్లే ఆఫ్ జట్ల విషయంలోనూ నెట్ రన్‌రేట్ కీలకంగా మారే ఛాన్స్ ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగు జట్లుకు సమానంగా పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉన్న జట్లు టాప్‌లో ఉన్నాయి. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయంతో పాయింట్ల పట్టికల్లో మార్పులు జరిగాయి. ఈ గెలుపుతో కేకేఆర్ వరుస పరాజయాలకు చెక్ పెడుతూ.. పాయింట్ల పట్టికలో ఏడోస్థానానికి చేరుకుంది. కోల్‌కతా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఆరు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. కేకేఆర్ చేతిలో ఓటమిపాలైనా ఆర్‌సీబీ ఐదోస్థానంలోనే ఉంది. అయితే నెట్ రన్‌రేట్ తగ్గింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో -0.139 నెట్ రన్‌రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయిన సీఎస్‌కే ఈసారి ధోనీ నాయకత్వంలో తిరిగి పుంజుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించింది. సీఎస్‌కే మరో మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ప్లే ఆఫ్‌కు చేరిపోతుంది. +0.662 నెట్ రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. 10 పాయింట్లు, +0.580 నెట్ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్‌కు చేరుగా ఉంది.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి కూడా అదేస్థాయి ఆటతీరును కనబరుస్తోంది. ఏడు మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్‌లో +0.844 అన్ని జట్ల కంటే ఎక్కువగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 8 పాయింట్లతో టాప్-4లో ఉంది. నెట్ రన్‌రేట్ +0.547 కూడా ఎక్కుగానే ఉంది. ఐదో స్థానంలో ఆర్‌సీబీ ఉంది.
పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలుపొందింది. 8 పాయింట్లు, -0.162 నెట్ రన్‌రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్ మూడు విజయాలతో ఏడోస్థానంలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ హాఫ్‌లో బాగా నిరాశపర్చింది. ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలోనే గెలుపొందింది. 6 పాయింట్లు, -0.620 నెట్ రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది. చివరి రెండుస్థానాల్లో హైదరాబాద్, ఢిల్లీ జట్లు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ 4 పాయింట్లు, -0.725 నెట్ రన్‌రేట్‌లో 9వస్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లు, -0.961 నెట్ రన్‌రేట్‌తో 10వ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలన ఏడింటిలో కనీసం ఆరు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. అదేసమయంలో నెట్ రన్‌రేట్ కూడా పెరగాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook