IPL 2023 Playoff Chances: ప్లే ఆఫ్ చేరేందుకు హైదరాబాద్ జట్టుకు ఉన్న సాధ్యాసాధ్యాలివే, ఏం జరగనుంది

IPL 2023 Playoff Chances: ఐపీఎల్ 2023లో అద్భతాలు జరుగుతున్నాయి.  సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూస్తే చాలు ఎలాంటి అద్బుతాలు జరుగుతున్నాయో అర్ధమౌతుంది. ఒక్క బంతి ఫలితాన్ని మార్చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 03:48 PM IST
IPL 2023 Playoff Chances: ప్లే ఆఫ్ చేరేందుకు హైదరాబాద్ జట్టుకు ఉన్న సాధ్యాసాధ్యాలివే, ఏం జరగనుంది

IPL 2023 Playoff Chances: ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, డిల్లీ కేపిటల్స్ జట్లు చివర్లో అద్బుతంగా రాణిస్తూ ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుతున్నాయి. నాకౌట్స్‌కు చేరాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందున్న అవకాశాలేంటో చూద్దాం.

ఐపీఎల్ 2023 నాకౌట్ దశకు చేరే ముందు సమీకరణాలు మారిపోతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ మినహాయించి మరే ఇతర జట్టుకు ప్లే ఆఫ్ స్థానం ఇంకా ఖరారు కాలేదు. మొన్నటి వరకూ వరుసగా ఓటమి పాలవుతూ వచ్చిన ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ జట్లు చివర్లో రెచ్చిపోతున్నాయి. విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు సైతం చివర్లో తడబడుతున్నాయి. దాంతో ఇతర జట్లకు అవకాశాలు సజీవమౌతున్నాయి. ఐపీఎల్ చివరి దశకు వచ్చినా ఇంకా నాకౌట్ దశకు చేరే జట్లేంటనేది ఖరారు కాని పరిస్థితి.

చావో రేవో తేలాల్సిన మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టుపై నో బాల్ పుణ్యమా అని గెలిచిన సన్‌రైజర్స్ హదరాబాద్ జట్టు నాకౌట్ అవకాశాల్ని మెరుగుపర్చుకుంది. పది మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్‌హెచ్ జట్టు కేవలం నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లు సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ద్వారా ప్లే ఆఫ్ చేరాలంటే రెండు మార్గాలున్నాయి ఈ జట్టుకు. 

ఇందులో మొదటి మార్గం మిగిలిన నాలుగు మ్యాచ్‌లను లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లపై గెలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో మరే ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడకుండా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. అదే మూడు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లు సాధించడం ద్వారా ప్లే ఆఫ్ చేరవచ్చు. కానీ చెన్నై, ముంబై, పంజాబ్, ఆర్సీబీ, ఆర్ఆర్, లక్నో జట్లలో కనీసం మూడు జట్లు మిగిలిన మ్యాచ్‌లు ఓడాల్సి వస్తుంది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ రన్‌రేట్‌తో నెగ్గాల్సి ఉంటుంది. అదే రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవల్సిందే.

Also read: RCB IPL Titles: అతడు కెప్టెన్‌గా ఉండి ఉంటే.. ఆర్‌సీబీ మూడు ఐపీఎల్‌ టైటిల్స్ గెలిచేది: వసీమ్ అక్రమ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News