IPL 2023 Final Last 2 Balls: మోహిత్ శర్మను నిద్రలోనూ వెంటాడుతున్న ఆ రెండు బంతులు

IPL 2023 Final Last 2 Balls: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అందరికీ గుర్తుండిపోయే మ్యాచ్. ముఖ్యంగా చివరి ఓవర్..చివరి రెండు బంతులు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అవే కదా మరి. మోహిత్ శర్మను కూడా ఆ రెండు బంతులే వెంటాడుతున్నాయిట.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2023, 02:24 PM IST
IPL 2023 Final Last 2 Balls: మోహిత్ శర్మను నిద్రలోనూ వెంటాడుతున్న ఆ రెండు బంతులు

IPL 2023 Final Last 2 Balls: నెట్ బౌలర్ స్థాయి నుంచి కీ బౌలర్‌గా ఎదిగిన అతి కొద్దిమందిలో ఒకడు గుజరాత్ టైటాన్స్ తురుపుముక్క మోహిత్ శర్మ. ఐపీఎల్ 2023 ఎంట్రీతోనే అందరి దృష్టీ ఆకర్షించిన మోహిత్ శర్మను ఈ సీజన్ ఫైనల్ పుణ్యమా అని మరింత పాపులర్ అయ్యారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన చివరి రెండు బంతులు నిద్రలో కూడా వెంటాడుతున్నాయి. 

ఐపీఎల్ 2023 సీజన్ 16లో నాలుగవ మ్యాచ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 14 మ్యాచ్‌లతో 25 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌లో 3 వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని గుజరాత్ వైపుకు మళ్లించగలిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా మోహిత్ శర్మను మొదటి 10 ఓవర్ల వరకూ బరిలో దింపలేదు. 11, 13, 15 ఓవర్లు వేయించాడు. 11వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మ..చెలరేగి ఆడుతున్న అజింక్యా రహానేను పెవిలియన్‌కు పంపించాడు. 13వ ఓవర్‌లో చెలరేగి ఆడిన అంబటి రాయుడిని అవుట్ చేసి చెన్నైను నిలువరించాడు. ఆ తరువాతి బంతికే కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీని అవుట్ చేసి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. ఫలితంగా చివర్ ఓవర్ వచ్చేసరికి చెన్నై సూపర్‌కింగ్స్ విజయానికి 13 పరుగులు కావల్సి వచ్చింది.

చివరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ వాస్తవానికి మొదటి నాలుగు బంతులు అత్యద్భుతంగా బౌల్ చేశాడు. అంతటి ఒత్తిడిలో కూడా మొదటి 4 బంతుల్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇంకా చివరి రెండు బంతులు మిగిలాయి. చెన్నై విజయం సాధించాలంటే 10 పరుగులు అవసరం. అంటే ఓ సిక్సర్ ఓ బౌండరీ తప్పదు. అనితర సాధ్యమైన లక్ష్యం. అందరూ గుజరాత్ టైటాన్స్‌దే టైటిల్ అనుకున్నారు. 

ఇంతలో వాటర్ బాటిల్ రూపంలో హార్దిక్ పాండ్యా మోహిత్ శర్మకు ఏదో సందేశం పంపించినట్టున్నాడు. మరింత ఒత్తిడికి లోనయ్యాడు. అప్పటి వరకూ కచ్చితమైన 4 యార్కర్ బాల్స్ వేసిన మోహిత్ శర్మ ఐదవ బంతిని ఆఫ్ పిచ్ వేయడంతో..అదును కోసం ఎదురుచూస్తున్న రవీంద్ర జడేజా సిక్సర్‌గా మలిచాడు. అంతే చివరి బంతికి కేవలం 4 పరుగులు అవసరమయ్యాయి. ఒత్తిడి మరింత పెరిగింది. చివరి బంతిని యార్కర్ వేసే క్రమంలో లెగ్ సైడ్‌కు వేసేశాడు. ఇంకేముంది..బౌండరీకు తరలించి చెన్నైకు విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా.

కేవలం రెండే రెండు బంతులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఇప్పుడు అందుకే మోహిత్ శర్మను ఆ రెండు బంతులే కలలో, నిద్రలో, వేకువలో వెంటాడుతున్నాయిట. ఫైనల్ మ్యాచ్ ముగిసి రెండ్రోజులు కావస్తున్నా ఇంకా అదే ఆలోచన వెంటాడుతోందట మోహిత్ శర్మకు. ఆ చివరి రెండు బంతులు అలా వేసుంటే ఏమయ్యేది, ఇలా వేసుంటే ఏమయ్యేదనేని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడట. ఫైనల్ మ్యాచ్ సరిగ్గా ముగించలేకపోయాననే గిల్ట్ ఫీలింగ్ వెంటాడుతోందట. ఏదో మిస్ అవుతున్నట్టు వేధిస్తోందట. మర్చిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని అంటున్నాడు. 

గత సీజన్‌లో నెట్ బౌలర్‌గా ఉండి..ఈ సీజన్‌లో టీమ్‌లో ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మకు ఐపీఎల్ 2023 సీజన్ చివరి వరకూ బాగానే సాగింది. మంచి ట్రాక్ రికార్డు దక్కించుకున్నాడు. 11, 13 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ఫలితాన్ని గుజరాత్ వైపుకు మళ్లించాడు. చివరి ఓవర్ మొదటి 4 బంతుల వరకూ అతని సామర్ధ్యం అద్భుతమే. కానీ చివరి రెండు బంతులే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. తీవ్రమైన ఒత్తిడితో బాల్స్ తడబడ్డాయి. మ్యాచ్ ఫలితం మారిపోయింది. అందుకే ఆ రెండు బంతులు ఇంకా ఇంకా మోహిత్ శర్మను వెంటాడుతూనే ఉన్నాయి.

Also read: IPL 2023 Records: ఐదు టైటిళ్లు గెలిచినా.. చెన్నైకు ఆ అవార్డు మాత్రం రాలేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News