GT Vs DC Dream11 Team: గుజరాత్ తాకిడిని తట్టుకుని ఢిల్లీ నిలబడుతుందా? ఈ రోజు డ్రీమ్‌ 11 టీమ్ ఇదే!

GT Vs DC Dream11 Team Prediction: ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన  డ్రీమ్‌ 11 టీమ్‌ వివరాలు, పీచ్‌ రిపోర్ట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 2, 2023, 11:45 AM IST
GT Vs DC Dream11 Team: గుజరాత్ తాకిడిని తట్టుకుని ఢిల్లీ నిలబడుతుందా? ఈ రోజు డ్రీమ్‌ 11 టీమ్ ఇదే!

GT Vs DC Dream11 Team Prediction: ఐపీఎల్‌ సీజనల్‌లో ఈ రోజు 44వ మ్యాచ్‌..అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. ఈ సీజనల్‌లో గుజరాత్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా ఆరు విజయాలు సాధించి.. రెండు ఓటములతో ఐపీఎల్‌ పైయిట్స్‌ టేబుల్‌లో మొదిటి స్థానంలో నిలిచింది. మొన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 179 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జోష్ లిటిల్, మహ్మద్ షమీ బౌలింగ్‌ చేయడంలో రాణిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా రెండు కేవలం రెండు మ్చాచ్‌లు మాత్రమే గెలిచింది. ఆరు మ్యాచ్‌లు ఓటమి చవిచూసి ఐపీఎల్‌ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.  ఈ రోజు జరిగబోయే మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైనది. 

పిచ్ రిపోర్ట్:
ఈ రోజు మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ ఎంచుకోవడం వల్ల మంచి స్కోర్‌ పొందొచ్చు.  మొదట బ్యాటింగ్ చేసే జట్టు 170 స్కోర్‌ చేసే అవకాశాలున్నాయి. 

Also Read: Rahu Transit 2023: మీ జీవితాన్ని మార్చేసే మాయాగ్రహం, రాత్రికి రాత్రి కుబేరుల్ని చేస్తుంది అదృష్టం పరీక్షించుకోండి మరి

డ్రీమ్‌ 11 ప్రిడిక్షన్:
వికెట్ కీపర్: ఫిల్ సాల్ట్
బ్యాటర్లు: డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్
బౌలర్లు: అన్రిచ్ నార్ట్జే, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ

డ్రీమ్‌ 11 టీమ్స్‌:
గుజరాత్ టైటాన్స్: 

శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (WK), సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ.

ఢిల్లీ క్యాపిటల్స్:
డేవిడ్ వార్నర్ (c), ఫిల్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ.

Also Read: Rahu Transit 2023: మీ జీవితాన్ని మార్చేసే మాయాగ్రహం, రాత్రికి రాత్రి కుబేరుల్ని చేస్తుంది అదృష్టం పరీక్షించుకోండి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News