CSK vs RR Highlights: తలైవా మ్యాజిక్.. రికార్డుస్థాయిలో వ్యూస్.. ధోని మెరుపులు ఎంతమంది చూశారంటే..

CSK vs RR Viewers Record: మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ధోని.. ఒక్కసారి క్రీజ్‌లోకి దిగితే మాత్రం బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తాడు. 41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ అలవోకగా సిక్సర్లు బాదుతున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 10:48 AM IST
CSK vs RR Highlights: తలైవా మ్యాజిక్.. రికార్డుస్థాయిలో వ్యూస్.. ధోని మెరుపులు ఎంతమంది చూశారంటే..

CSK vs RR Viewers Record: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరివరకు పోరాడి మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్  6 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో చివర్లో (32, 17 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (25, 15 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా.. చెన్నై విజయాన్ని అందులేకపోయింది. ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చెన్నై స్డేడియం మొత్తం తలైవా నామస్మరణతో మార్మోగిపోయింది.

ఎంఎస్ ధోని సిక్సర్లు బాదుతుంటే క్రికెట్ అభిమానులు సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ధోనీ బ్యాటింగ్‌ను టీవీ వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఏకంగా రికార్డులు బద్దలుకొట్టే స్థాయిలో వీక్షకులు ఆన్‌లైన్‌లో చూశారు. ధోని క్రీజ్‌లో ఉన్న సమయంలో ప్రత్యక్ష ప్రసార వీక్షకుల సంఖ్య 22 మిలియన్లు దాటింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వీక్షకుల సంఖ్య కావడం విశేషం. ఈ మ్యాచ్‌ ఆన్‌లైన్‌లో కోటి మందికి పైగానే వీక్షించారు. మ్యాచ్‌ ముగింపునకు వచ్చే కొద్దీ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. ధోని బ్యాటింగ్‌ను 2.2 కోట్ల మంది అభిమానులు లైవ్‌లో చూశారు.

అంతకుముందు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎక్కువమంది వీక్షించారు. ఈ మ్యాచ్‌ను 18 మిలియన్ల మంది చూశారు. ఈ రికార్డును రాజస్థాన్-చెన్నై మ్యాచ్‌ బద్దలు కొట్టింది. అది కూడా ధోని మ్యాజిక్‌తోనే సాధ్యమైంది. ఇటీవల చెన్నై, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌కు 1.7 కోట్ల వ్యూస్ రాగా.. చెన్నై, గుజరాత్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని 16 మిలియన్ల మంది వీక్షించారు. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను జియో సినిమాలో ఉచితంగా చూడొచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు జియో ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. జియో సినిమా ఓటీటీ, జియో సినిమా వెబ్‌లో అందుబాటులో ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.

Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు

మ్యాచ్‌ విషయానికి వస్తే.. 15 ఏళ్ల తరువాత చెపాక్ స్టేడియంలో రాజస్థాన జట్టు విజయాన్ని అందుకుంది. మొదటి సీజన్ 2008లో 10 పరుగులతో విజయాన్ని అందుకున్న రాజస్థాన్.. ఆ తరువాత మళ్లీ ఎప్పుడు గెలవలేదు. గత 15 ఏళ్లలో చెపాక్‌లో తలపడిన ప్రతి మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌కు పరాజయమే ఎదురైంది. ఎట్టకేలకు బుధవారం చెన్నైను ఓడించి.. చెపాక్‌లో సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టింది. 

Also Read: Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News