CSK Vs GT Prediction: గుజరాత్ వర్సెస్ చెన్నై హెడ్ టు హెడ్ రికార్డులు.. ప్లేయింగ్ 11 ఇదే..!

GT vs CSK Playing 11 and Pitch Report: గుజరాత్, చెన్నై జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ఆరంభంకానుంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్ గెలుచుకుని అన్ని జట్లకు గుజరాత్ షాకివ్వగా.. ప్రతిసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరే చెన్నై జట్టు గత సీజన్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. తొలి మ్యాచ్ రెండు బలమైన జట్ల మధ్య ఆసక్తికరంగా సాగనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 05:26 PM IST
  • రేపే ఐపీఎల్ ఆరంభం
  • గుజరాత్, చెన్నై జట్ల మధ్య పోరు
  • పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11పై ఓ లుక్కేయండి
CSK Vs GT Prediction: గుజరాత్ వర్సెస్ చెన్నై హెడ్ టు హెడ్ రికార్డులు.. ప్లేయింగ్ 11 ఇదే..!

GT vs CSK Playing 11 and Pitch Report: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఒక రోజు గడిస్తే క్రికెట్ పండుగ మొదలుకానుంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరుతో ఆరంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. గతేడాది గుజరాత్ ఛాంపియన్‌గా నిలవగా.. చెన్నై జట్టు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గతేడాది ప్రదర్శనను మరిచిపోయి ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే రంగంలోకి దిగనుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గుజరాత్ టైటాన్స్ జట్టు విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉండగా.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, మ్యాచ్‌ ప్రిడిక్షన్‌పై ఓ లుక్కేయండి.
  
హెడ్ టు హెడ్ రికార్డులు..

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడింది ఒక సీజనే. గతేడాది గుజరాత్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ పాండ్యా  సేన విజయం సాధించింది. గణాంకాల ఆధారంగా చూస్తే గుజరాత్ జట్టుదే మరోసారి పై చేయి కనిపిస్తున్నా.. ధోని సారథ్యంలో చెన్నై జట్టును తక్కువ అంచనా వేయలేం.

పిచ్ రిపోర్ట్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ.. స్పిన్నర్లు ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తారు. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170 పరుగులు. ఎక్కువసార్లు ఛేజింగ్ చేసే జట్టే ఇక్కడ విజయం సాధించింది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

టీ20ల్లో ఒక్క బంతికే మ్యాచ్ స్వరుపాలు మారిపోతాయి. సీఎస్‌కే, గుజరాత్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు కనిపిస్తోంది. అయితే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న హార్దిక్ పాండ్యా సేన కాస్త బలంగా కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు సమతూకంగా ఉంది. సొంత మైదానంలో ఆడుతుండడం కలిసి వచ్చే అంశం. ఓవరాల్‌గా మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ప్లేయింగ్ 11 ఇలా (అంచనా)..

చెన్నై: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, ఒడియన్ స్మిత్, రషీద్ ఖాన్, శివమ్ మావి, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  

Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News