Amit Mishra Using Saliva on Ball: విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేస్తూ బంతికి ఉమ్ము రుద్దాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా మరోసారి ఐసిసి నిబంధనలను లెక్కచేయకుండా ప్రవర్తించి కెమెరాలకు చిక్కాడు. మిశ్రాకు ఐసిసి రూల్స్ అంటే లెక్కలేదా ? లేదా కొవిడ్-19 నిబంధనలు అంటే లెక్కలేదా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అమిత్ మిశ్రా చేసిన తప్పేంటంటే..

Written by - Pavan | Last Updated : Apr 11, 2023, 05:19 AM IST
Amit Mishra Using Saliva on Ball: విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేస్తూ బంతికి ఉమ్ము రుద్దాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా ఐసిసి నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డంగా కెమెరాలకు చిక్కాడు. లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 12వ ఓవర్లో మొదటి బంతిని విసిరే క్రమంలో ఆ బంతిపై లాలాజలం అప్లై చేస్తున్న దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంతిపై లాలాజలం రుద్దడాన్ని అప్పట్లోనే ఐసిసి నిషేధించింది. ఈ నిబంధన ఐపిఎల్ టోర్నీలకు కూడా వర్తిస్తుంది అని ఐసిసి స్పష్టంచేసింది. అయినప్పటికీ అమిత్ మిశ్రా మాత్రం అదేమీ పట్టనట్టుగా ఎప్పటిలాగే బంతిపై తన లాలాజలాన్ని అప్లై చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనియాంశమైంది.

విరాట్ కోహ్లి స్ట్రైకింగ్ లో ఉండగా.. అమిత్ మిశ్రా బంతికి లాలాజలం రుద్దుతూ బౌలింగ్ చేశాడు. ఆ బంతికి సింగిల్ తీసిన విరాట్ కోహ్లీ.. ఆ తరువాత మిశ్రా వేసిన మూడో బంతికి బంతిని షాట్ కి ట్రై చేయబోయి.. మార్కస్ స్టోయినిస్‌ కి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లి ఔట్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు కారణం అయ్యాడు.

అయితే, అమిత్ మిశ్రా ఇలా బంతిపై లాలాజలం రుద్దిన వివాదంలో ఇరుక్కోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించే సమయంలోనూ అమిత్ మిశ్రా ఇలా లాలాజలం ఉపయోగించి మీడియా కంట్లో పడ్డాడు. మళ్లీ ఇప్పుడిలా ఈ ఐపిఎల్ టోర్నీలోనూ అదే సీన్ రిపీట్ చేయడంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. అమిత్ మిశ్రాకు ఐసిసి నిబంధనలు అంటే లెక్కలేదా లేక కొవిడ్ నిబంధనలు అంటే నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

 

 

ఇది కూడా చదవండి : Biggest Six of IPL 2023: ఈ ఐపిఎల్ 2023 సీజన్‌లో ఇదే భారీ సిక్స్.. బంతి ఎక్కడ పడిందో తెలుసా ?

ఇదిలావుంటే, ఐపీఎల్ 2020లో ఒకసారి విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పొరపాటే చేశాడు. కాకపోతే వెంటనే తన తప్పు తెలుసుకుని తనే తప్పు చేశానన్నట్టుగా చేయి ఎత్తి తన పొరపాటును సరిదిద్దుకున్నాడు. షార్ట్ కవర్ వద్ద బంతిని ఆపిన విరాట్ కోహ్లీ.. అనుకోకుండానే బంతిపై లాలాజలం అప్లై చేశాడు. ఆ తరువాత వెంటనే తన తప్పును గ్రహించిన విరాట్ కోహ్లీ.. నవ్వుతూ తన చేతిని పైకెత్తి తన తప్పిదాన్ని అంగీకరిస్తున్నట్టుగా ఒక స్మైల్ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి : Who is Rinku Singh: వరుసగా 5 సిక్సులు కొట్టిన రింకూ సింగ్ ఎవరో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News