IPL SRH vs LSG: అర్ధ సెంచరీలతో మెరిసిన రాహుల్, దీపక్ హుడా... హైదరాబాద్ టార్గెట్ 170...

IPL SRH vs LSG: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 10:09 PM IST
  • ఐపీఎల్‌లో ఇవాళ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్
  • ముంబై డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్
  • తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు
  • హైదరాబాద్ ముందు 170 పరుగుల లక్ష్యం
IPL SRH vs LSG: అర్ధ సెంచరీలతో మెరిసిన రాహుల్, దీపక్ హుడా... హైదరాబాద్ టార్గెట్ 170...

IPL SRH vs LSG: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్-లక్నో జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ దీపక్ హుడా అర్ధ సెంచరీలతో రాణించారు.

రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు మినహా లక్నో బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. డికాక్, లూయిస్ ఇద్దరూ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరారు. మనీష్ పాండే, బదోని స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్-దీపక్ హుడా భాగస్వామ్యం జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కేలా చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెఫర్డ్, టి.నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.

ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓడగా.. చెన్నైతో మ్యాచ్‌లో గెలుపొందింది. ఇక హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ చేతిలో ఓడిపోయింది. తాజా మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. 

Also Read: డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు.. ప్రముఖ బీజేపీ నేత కుమారుడు... బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు... ఎఫ్ఐఆర్‌లో ఆ నలుగురి పేర్లు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News