ఐపీఎల్ వేలంపాట మొదలైంది.. బరిలో క్రికెటర్లు

ఐపీఎల్‌–11 సీజన్‌ కోసం క్రికెటర్లను అధిక మొత్తం ఇచ్చి చేజిక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. 

Last Updated : Jan 27, 2018, 01:15 PM IST
ఐపీఎల్ వేలంపాట మొదలైంది.. బరిలో క్రికెటర్లు

ఐపీఎల్‌–11 సీజన్‌ కోసం క్రికెటర్లను అధిక మొత్తం ఇచ్చి చేజిక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. శనివారం ప్రారంభయ్యే ఈ వేలంలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకోబోతున్నాయి. గొప్ప ఆటగాళ్లను కైవసం చేసుకొనేందుకు ఫ్రాంచైజీలు ఎత్తుకు పై ఎత్తులు వేయనున్నాయి.  భారత్‌ నుండే 361 మంది వేలంలో పాల్గొననున్నారు. అయితే మొత్తంగా చూస్తే 578 ఆటగాళ్లు తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు.  శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, క్రిస్‌గేల్, మిచెల్ స్టార్క్, డ్వేన్ బ్రావో, అశ్విన్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, క్రిస్‌లిన్, పొలార్డ్ తదితర క్రికెటర్లపై ఫ్రాంచైజీలు ఈసారి అధిక మొత్తం వెచ్చించే అవకాశమైతే ఉంది.

బెంగళూరు వేదికగా శనివారం ఉదయం 9 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. అలాగే ఆదివారం కూడా ఈ వేలం కొనసాగుతుంది. అయితే ఇంతమంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నా ప్రధానంగా తొలివిడతలో 16 మంది ఆటగాళ్ళ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఆ 16 మంది ధర దాదాపు 2 కోట్లకు పైమాటే ఉంటుంది. స్టార్ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను కైవసం చేసుకున్నాక... ప్రధాన పోటీ దేశీయ ఆటగాళ్ల మధ్య ఉంటుంది. రంజీలో సత్తా చాటిన  రజినీశ్ గుర్భానీ, నవ్‌దీప్ సైనీ మధ్య కూడా గట్టిపోటీనే ఉంది. మరో దేశీయ ఆటగాడు కృనాల్ పాండ్య ధర 40 లక్షలు ఉండగా.. వేలం ఈ దేశీయ ఆటగాళ్ల ధరలన్నీ కోట్లు పలికే అవకాశం ఉందని కూడా వినికిడి. అలాగే అండర్ 19లో రాణించిన పృథ్వీషా, శుభ్‌మన్‌గిల్, అభిషేక్ శర్మ తదితరులు కూడా పోటీ బరిలో ఉన్నారు

Trending News