ఐపీఎల్‌ వేలంపాటలో జరిగిన షాకింగ్ విషయాలు మీకోసం

ఐపీఎల్ వేలంపాట రెండు రోజులుగా జరుగుతోంది. ఎన్నో చిత్ర విచిత్రాల మధ్య.. ఫ్రాంచైసీల ఎత్తుకు పై ఎత్తుల మధ్య క్రికెటర్లు ఆడడానికి కోట్లాది రూపాయలకు అమ్ముడైపోతున్నారు.

Last Updated : Jan 29, 2018, 08:25 AM IST
ఐపీఎల్‌ వేలంపాటలో జరిగిన షాకింగ్ విషయాలు మీకోసం

ఐపీఎల్ వేలంపాట రెండు రోజులుగా జరుగుతోంది. ఎన్నో చిత్ర విచిత్రాల మధ్య.. ఫ్రాంచైసీల ఎత్తుకు పై ఎత్తుల మధ్య క్రికెటర్లు ఆడడానికి కోట్లాది రూపాయలకు అమ్ముడైపోతున్నారు. 20 లక్షల నుండి 11 కోట్ల రూపాయల వరకు ధర పలికిన క్రికెటర్లను దక్కించుకోవడానికి టీమ్స్ గట్టిపోటీనే ఇచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం

*ఆదివారం జరిగిన వేలంపాటలో భారతీయ ఆటగాడు జయదేవ్‌ ఉనద్కత్‌  అత్యధిక ధర పలికిన ఇండియన్ ఆటగాడిగా నిలిచాడు. ఉనద్కత్‌ను కొనుగోలు చేయడానికి పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీపడ్డా... చివరికి అతడిని రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.11.50కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఉనద్కత్‌ ప్రారంభ ధర రూ.1.50కోట్ల అయినా.. తన ధర అంత రేంజ్‌కి వెళ్లడం ఆశ్చర్యమే.

*16ఏళ్ల అఫ్గాన్‌ కుర్రాడు ముజీబ్‌ జర్దాన్‌ను రూ.4కోట్లు వెచ్చించి మరీ.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అంటే ఇక్కడ అనుభవం కన్నా.. యంగ్ టాలెంట్‌కి కూడా ఐపీఎల్ పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు

*చిత్రమేంటంటే...క్రిస్ గేల్ లాంటి స్టార్ ఆటగాడిని కొనడానికి ఐపీఎల్‌-11 సీజన్‌లో ఏ ఫ్రాంచైసీ ముందుకు రాకపోవడం ఆశ్చర్యమే. గత సీజన్ అప్పుడు తను ఘోరంగా విఫలం కావడమే అందుకు కారణమని కూడా వార్తలు వస్తున్నాయి

*పది కోట్ల కంటే ఎక్కవ ధర పలికిన ఆటగాళ్లలో ఇద్దరు భారతీయులు ఉండడం ఆశ్చర్యమే. కేఎల్ రాహుల్ 11 కోట్లకు కింగ్స్ 11 పంజాబ్‌కు అమ్ముడుపోగా.. మనీష్ పాండే కూడా అదే మొత్తానికి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడడానికి వెళ్తున్నాడు

*మొదటి రోజు ఆట ముగిసే సరికి రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా రూ.23.50 కోట్లు వెచ్చించి 9 మందిని కొనుగోలు చేయడం విశేషం

*భారత్‌లో తిరుగులేని క్రికెటర్లుగా పేరొందిన యువీ, గంభీర్‌, హర్భజన్‌‌లకు చాలా తక్కువ ధరలు పలకడం గమనార్హం. యువీని రూ.2 కోట్లకు పంజాబ్‌ జట్టు తీసుకోగా..హర్భజన్‌ను రూ.2 కోట్లకు చెన్నై తీసుకుంది. ఇక గంభీర్‌ను రూ.2.8 కోట్లకు దిల్లీ డేర్‌ డేవిల్స్‌ ఆడించడానికి తీసుకుంది

*హర్దిక్ పాండ్య సోదరుడు కృనాల్‌ను ముంబయి రూ.8.80 కోట్లకు దక్కించుకోవడం మరో అద్భుతం

* ఆస్ట్రేలియా క్రికెటర్‌ షాన్‌ మార్ష్‌‌ని ఏ ఫ్రాంచైసీ దక్కించుకోకపోవడం ఒకటైతే... డేల్ స్టెయిన్, సిమ్మన్స్ లాంటి వారిని కూడా ఈ సారి ఏ జట్టూ పట్టించుకోలేదు

* పెద్దగా పేరులేని కర్ణాటక క్రికెటర్ గౌతమ్ క్రిష్ణ ఐపీఎల్‌ వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైపోయాడు. గౌతమ్‌ను రూ. 6.2 కోట్లు పెట్టి రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకోవడం విశేషం

*అండర్‌-19 కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషాన్‌ 6.2 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడడానికి వెళ్లడం కూడా ఆశ్చర్యమే.

*అండర్ 19 ఆడుతున్న కుర్రాళ్లపై ఈ సారి ఐపీఎల్ ఫ్రాంచైసీలు బాగానే డబ్బులు పెట్టాయి. వెస్టిండీస్‌ అండర్‌-19 జట్టులో ఆడుతున్న జోఫ్రా ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల ధర పలికిందటే అందరూ ఆశ్ఛర్యపోయారు. 

Trending News