IPL Auction 2024 Live updates: దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో విక్రయించబడిన మొదటి క్రికెటర్ గా విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ నిలిచాడు. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 7.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ కరేబియన్ ఆటగాడు కోసం రాజస్థాన్ మరియు కోల్‌కతా జట్లు ఆక్షన్ లో పోటీపడ్డాయి. చివరకు పావెల్ ఆర్ఆర్ కు దక్కాడు. ఈ వెస్టిండీస్ టీ20 కెప్టెన్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
పావెల్ 17 ఐపీఎల్ మ్యాచ్‌లలో 146.02 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కరీబియన్ ఆటగాడు 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇతడికి టీ20 ఫార్మాట్ లో మంచి అనుభవం ఉంది. పావెల్ దాదాపు 200 మ్యాచ్‌లు ఆడాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇతడు బార్బడోస్ కు ఆడుతున్నాడు.
తాజాగా నిర్వహిస్తున్న ఐపీఎల్ వేలంలో మెుత్తం 333 ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 214 మంది స్వదేశీ, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 116 మంది క్యాప్డ్, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఈ మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్లను తీసుకోబోతున్నాయి. ఇందులో 30 మంది ఫారిన్ ఫ్లేయర్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం ఆక్షన్ దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook