Jason Holder sold to Lucknow Super Giants for Rs 8.75 crore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భారీ ధర పలికాడు. కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ 2021 కోసం తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడికి కేవలం 75 లక్ష్యలు చెల్లించగా.. ఇప్పుడు అతడికి లక్నో జాక్ పాట్ ఇచ్చింది. ఏకంగా 8 కోట్లు ఎక్కువ చెల్లించింది. గతేడాది హోల్డర్ బ్యాట్, బాల్‌తో రాణించడంతోనే లక్నో అంత వెచ్చించింది.
ఆల్‌రౌండర్‌గా జాసన్ హోల్డర్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ జట్టుకే కాకుండా పలు లీగుల్లో కూడా ఆడుతూ సత్తాచాటుతున్నాడు. పేస్ బౌలింగ్‌తో ఎంతటి టాప్ బ్యాటర్‌ను అయినా ఇబ్బందిపెట్టే హోల్డర్.. బ్యాట్‌తో కూడా రాణించగలడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి భారీ షాట్లు ఆడగలడు. ఒక్కోసారి హోల్డర్ కొట్టిన సిక్సులు మైదానం బయట కూడా పడతాయి. ఒకే ఓవర్లో 3-4 సిక్సులు బాదగల సామర్థ్యం అతడి సొంతం. హోల్డర్ ఐపీఎల్ టోర్నీలో 26 మ్యాచులు ఆడాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు)లను వేలంకు ముందు తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 వేలంలో క్వింటన్ డికాక్ (6.75 కోట్లు), మనీష్ పాండే (4.6 కోట్లు), జాసన్ హోల్డర్ (రూ 8.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు)లను లక్నో తీసుకుంది. లక్నో ఫ్రాంచైజీని RPSG గ్రూప్ 7090 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ.
.@Jaseholder98 is SOLD to @LucknowIPL for INR 8.75 Crore 👏👏#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు:
# కేఎల్ రాహుల్ -రూ.17 కోట్లు
# మార్కస్ స్టోయినిస్ - రూ. 9.2 కోట్లు
# రవి బిష్ణోయ్ - రూ. 4 కోట్లు
# క్వింటన్ డి కాక్ - రూ. 6.75 కోట్లు
# మనీష్ పాండే - రూ. 4.6 కోట్లు
# జాసన్ హోల్డర్ - రూ 8.75 కోట్లు
# దీపక్ హుడా - రూ 5.75 కోట్లు
Also Read: IPL Mega Auction 2022: ట్రెంట్ బౌల్ట్‌కు రాజస్తాన్ భారీ ధర.. రిటైన్ చేసుకోలేకపోయిన ముంబై..
Also Read: David Warner DC: అయ్యో డేవిడ్ వార్నర్.. ఎంత పనాయే! మరీ ఇంత తక్కువనా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook