IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్ను

IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంత పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తలపడనుంది. పరుగుల సునామీ సృష్టిస్తున్న ఎస్ఆర్‌హెచ్ ఈసారి 300 పరుగులు మైలురాయి చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2024, 11:22 AM IST
IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్ను

IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టిస్తోంది. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డును సాధించడమే కాకుండా మూడు కార్లు రికార్డ్ బ్రేక్ చేసింది. అందుకే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడే పరిస్థితి వచ్చింది. 

ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్ మరోసారి ఆర్సీబీని ఢీ కొట్టనుంది. బెంగళూరు పిచ్‌పైనే ఆర్సీబీపై 287 పరుగులతో విధ్వంసం రేపిన ఎస్ఆర్‌హెచ్ సొంత పిచ్‌పై ఇంకెలా చెలరేగుతుందనేది ఆసక్తిగా మారింది. ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ ఖాన్ అందరూ విజృంభించేవాళ్లే. ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌లో అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విజృంభణకు బౌలర్లు చేతులెత్తేశారు. రికార్డుల మోత మోగింది. కేవలం 6 ఓవర్లలోనే స్కోరు 120 పరుగులు దాటేసింది. 

ఇక ఆర్సీబీ నుంచి దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉన్నారు. అటు హైదరాబాదీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ సొంత పిచ్‌పై చెలరేగే అవకాశాలున్నాయి. అందుకే ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కు టికెట్లు క్షణాల్లో అయిపోయాయి. ఇవాళ్టి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారానికి రెస్టారెంట్లు, పుడ్ కోర్టులు, మాల్స్ అన్నీ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ ఆర్సీబీకు జీవన్మరణ సమస్య. ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆర్సీబీకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవు. దాంతో డూ ఆర్ డై తరహాలో ఆడే అవకాశాలున్నాయి. 

ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ మరోసారి చెలరేగితే మాత్రం టార్గెట్ 300 చేరుకోవడం కష్టం కాదంటున్నారు. సొంత పిచ్ కావడంతో ఎస్ఆర్‌హెచ్ జట్టు అద్భుతం చేసి చూపిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కొందరు. 

Also read: Usain Bolt: టీ20 ప్రపంచకప్‌కు ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఎంపిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News