IPL 2024, RCB vs SRH Match live Score: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ భారీగా పరుగులు రాబడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. ఈ విండీస్ వీరుడు కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక రెండో స్థానంలో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో వంద కొట్టాడు. డేవిడ్ మిల్లర్ కేవలం 38 బంతుల్లోనే సెంచరీ చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్..
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లుతో 34 పరుగులు చేసిన అభిషేక్ టోప్లే బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం హెడ్ కు జతకలిసిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను పిచ్చకొట్టుడూ కొట్టారు. ఈ క్రమంలో హెడ్ సెంచరీ సాధించాడు. మరోవైపు క్లాసెన్ కూడా అర్థ శతకం చేశాడు.
మెుదట హెడ్... చివర్లో సమద్..
శతకం సాధించిన హెడ్ ను పెర్గుసన్ పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం క్లాసెన్, మార్కక్రమ్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 231 పరుగుల వద్ద క్లాసెన్ ఔటయ్యాడు. ఇతడు 31 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేసాడు. చివరిలో అబ్ధుల్ సమద్ చెలరేగాడు. కేవలం పది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు అత్యధిక స్కోరును చేసింది.
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు కూడా ఎస్ హెర్ఆచ్ పేరు మీదే ఉండేది. ఈ సీజన్ లోనే ఆ జట్టు ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు చేసింది. ఇప్పుడు తన రికార్డును తనే బద్దలుకొట్టింది.
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 𝗜𝗣𝗟 𝗛𝘂𝗻𝗱𝗿𝗲𝗱!
A century off just 39 deliveries for Travis Head 🔥🔥
4th Fastest in IPL history!
Follow the Match ▶️ https://t.co/OOJP7G9bLr#TATAIPL | #RCBvSRH pic.twitter.com/25mCG5fp4C
— IndianPremierLeague (@IPL) April 15, 2024
Also Read: Rohit Sharma Oops Moment: ప్యాంట్ జారిపోతున్నా ఫీల్డింగ్ అద్భుతంగా చేసిన రోహిత్, వీడియో వైరల్
Also Read: MI vs CSK Match: లైవ్ మ్యాచ్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన బౌచర్, పొలార్డ్... వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter