IPL 2024: ఆరెంజ్ లిస్టులో హైదరాబాద్‌ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్‌కే బౌలర్..

IPL 2024 live updates: ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో సీఎస్కే టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మిగతా టీమ్స్ పొజిషన్ ఏంటి, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఎవరో ఉన్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 29, 2024, 06:00 PM IST
IPL 2024: ఆరెంజ్ లిస్టులో హైదరాబాద్‌ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్‌కే బౌలర్..

IPL 2024 Orange Cap & Purple Cap: ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. హెన్రిచ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేశాడు.  రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ నిన్న ఢిల్లీపై 84 పరుగుల చేయడంతో టాప్-2 ఫ్లేస్ కు చేరుకున్నాడు. అతడు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 127 రన్స్ చేశాడు. ఇక ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ 98 పరుగులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

సీఎస్‌కే ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 6 వికెట్లతో ఈరేసులో ముందుంజలో ఉన్నాడు. సెకండ్ ఫ్లేస్ లో పంజాబ్ కింగ్స్ ఫ్లేయర్ హర్‌ప్రీత్ బ్రార్ ఉన్నాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌లలో మూడు  వికెట్లు తీసుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

టాప్ ప్లేస్ లో చెన్నై.. చివరి స్థానంలో లక్నో..
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. ఆ జట్టు రెండు మ్యాచుల్లో గెలిచి +1.979 నాలుగు పాయింట్లు సాధించింది. ఈ జాబితాలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. గురవారం ఢిల్లీపై నెగ్గిన ఆ జట్టు +0.800 రన్ రేట్ తో సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ +0.675 రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక చివరి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, దాని కంటే ముందు స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. 

Also Read: DC vs RR Live Score : పిచ్చకొట్టుడు కొట్టిన పరాగ్.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

Also Read: Hardik Pandya: రెండు మ్యాచ్‌లతోనే జీరోగా మారిన హార్దిక్ పాండ్యా చేసిన తప్పులేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News