ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లు గడువు తేదీకు ఒకరోజు ముందే జాబితా విడుదల చేశాయి. డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న వేలానికి ముందు రిటెన్షన్, రిలీజ్ జాబితా సిద్ధమైంది. అదే సమయంలో ఏ జట్టు వ్యాలెట్‌లో ఎంత ఉందో తేలిపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యాలెట్‌లో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలుండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్లు మిగిలుంది. 2023లో జరగనున్న ఐపీఎల్ కోసం వేలంలో పది జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 163 మంది ఆటగాళ్లు రిటైన్ కాగా 87 స్లాట్స్ వేలానికి అందుబాటులో ఉన్నాయి. వివిధ జట్ల వద్ద మొత్తం 206.5 కోట్ల రూపాయలు వేలం కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్ 2023, ఏ జట్టు వద్ద ఎంత డబ్బుంది
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేయగా అందులో 6 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈ జట్టు వద్ద 20.45 కోట్లున్నాయి. మరో 9 మంది ఆటగాళ్లను తీసుకోనుంది.
ఇక ఢిల్లీ కేపిటల్స్ జట్టు 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా విదేశీ ఆటగాళ్లు 6 మంది ఉన్నారు. ఇప్పటికే 75.55 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా 19.45 కోట్లు మిగిలున్నాయి. మరో 7 మందిని తీసుకోవచ్చు.
గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, 5 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 75.75 కోట్లు ఖర్చు చేయగా ఇంకా 19.25 కోట్లు మిగలున్నాయి. కాగా ఇంకా పదిమందిని తీసుకోనుంది.
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 14 మంది ఆటగాళ్లను రిటైన్ చేయగా అందులో 5 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇప్పటికే ఈ జట్టు అత్యధికంగా 87.95 కోట్లు ఖర్చు చేయగా ఇంకా కేవలం 7.05 కోట్లు మాత్రమే మిగిలున్నాయి. ఇంకా 11 మందిని తీసుకోనుంది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. ఇప్పటి వరకూ 71.65 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా 23.35 కోట్లు మిగిలున్నాయి. మరో పది స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా అందులో 5 మంది విదేశీయులున్నారు. ఇప్పటి వరకూ ఈ జట్టు 74.45 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా 20.55 కోట్లు మిగిలున్నాయి. 9 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకోగా, 5 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇప్పటి వరకూ ఈ జట్టు 62.8 కోట్లు ఖర్చు చేయగా ఇంకా 32.2 కోట్లు మిగిలున్నాయి. ఇక 9 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా అందులో 6 మంది విదేశీయులున్నారు. ఇప్పటి వరకూ ఈ జట్టు 86.25 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా 8.75 కోట్లు మిగిలున్నాయి. 7 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకూ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేయగా, అందులో నలుగురు విదేశీయులున్నారు. ఇప్పటివరకూ 81.8 కోట్లు ఖర్చు చేయగా ఇంకా 13.2 కోట్లు మిగిలున్నాయి. 9 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా 4 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇప్పటి వరకూ ఈ జట్టు 52.75 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా అత్యధికంగా 42.25 కోట్లు మిగిలున్నాయి. 13 మందిని తీసుకోనుంది.
Also read: INDW vs AUSW: సూపర్ ఓవర్లో భారత్ విజయం.. సంచలన విజయంతో సిరీస్ సమం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook