IPL 2022: ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ, సుందర్ మళ్లీ దూరం

IPL 2022: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఓటమి బాటపడుతుంటే..అది చాలదన్నట్టు ఇంకో షాక్ ఎదురైంది. టీమ్‌లో కీలక బౌలర్ మరోసారి దూరమయ్యాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2022, 03:08 PM IST
  • ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో షాక్, ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు సుందర్ దూరం
  • చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతికి మళ్లీ గాయం
  • ధృవీకరించిన ఎస్ఆర్‌హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ
IPL 2022: ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ, సుందర్ మళ్లీ దూరం

IPL 2022: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఓటమి బాటపడుతుంటే..అది చాలదన్నట్టు ఇంకో షాక్ ఎదురైంది. టీమ్‌లో కీలక బౌలర్ మరోసారి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2022లో కీలకమైన రెండవ దశ సాగుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండేందుకు, ప్లే ఆఫ్ చేరేందుకు ఇదే కీలకం. ఇప్పటివరకూ దిగువన ఉన్న టీమ్స్ ఇక నుంచి విజయాలు సాధిస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రారంభంలో వరుస రెండు ఓటములతో నిరాశపర్చి ఆ తరువాత కోలుకుని వరుసగా 5 మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచంది ఎస్ఆర్‌హెచ్. తిరిగి మళ్లీ పరాజయబాట ప్రారంభమైంది. మొన్న గుజరాత్ టైటాన్స్ , నిన్న చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈలోగా ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో షాక్ ఎదురైంది. ఆ టీమ్ కీలకమైన బౌలర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి దూరమయ్యాడు. చేతికి గాయం కారణంగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమౌతున్నాడు. ఈ విషయాన్ని టీమ్ హెడ్ కోచ్ టామ్ మూడీ ధృవీకరించాడు.

వాస్తవానికి చేతి వేలికి గాయం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడలేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కే అందుబాటులో వచ్చాడు.ఇప్పుడు మళ్లీ కుడిచేతికి గాయమై..మరోసారి దూరమయ్యాడు. సుందర్ దూరం కావడం ఎస్ఆర్‌హెచ్ జట్టుకు ఎదురుదెబ్బే.

Also read: Dhoni Fires On Bowler: చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ ముఖేష్‌ చౌదరీపై ధోనీ ఆగ్రహం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News