IPL 2022: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి టోర్నీ అట్టహాసంగా షురూ కానుంది. అయితే గతేడాది ట్రోఫీ నెగ్గిన.. ముంబయి ఇండియన్స్ ఈ సారి కూడా ఫేవరేట్ గా బరిలో దిగనుంది. మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ నుంచే జట్టులోని కీలక బ్యాట్స్ మన్ సూర్య కుమార్ యాదవ్ దూరం కానున్నాడని సమచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
ఇటీవలే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ గాయపడ్డాడు. అయితే ఐపీఎల్ ప్రారంభం తర్వాత ముంబయి జట్టు ఢిల్లీతో ఆడనున్న తొలి మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ కోలుకునే అవకాశం లేదు. దీంతో ఆ మ్యాచ్ కు అతడు దూరం కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ సమయానికి సూర్య కుమార్ యాదవ్ కొలుకొని జట్టులో ఆడతాడని సమచారం.
ముంబయి ఇండియన్స్ శిబిరానికి క్రికెటర్లు
రోహిత్ శర్మ సారథ్యంలో ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టు పూర్తైన తర్వాత రోహిత్ శర్మ, భార్య రితిక, కుమార్తె సమైరాతో కలిసి ముంబయి ఇండియన్స్ శిబిరంలో చేరాడు. మరోవైపు పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో సహా ఇతర ఆటగాళ్లు ముంబయి ఇండియన్స్ టీమ్ హోటల్ కు చేరుకున్నారు.
ALso Read: IPL 2022 New Rules: డీఆర్ఎస్, సూపర్ ఓవర్‌లో కీలక మార్పు.. ఐపీఎల్ 2022 నయా రూల్స్ ఇవే!!
Also Read: Kohli Fans Arrested: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook