IPL 2022, RR vs GT: Vijay Shankar should be banned from playing cricket: 2019 వన్డే ప్రపంచకప్‌కు తెలుగు తేజం అంబటి రాయుడిని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం కోసం విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాయుడికి బదులుగా శంకర్‌ను ఎంపికచేయడంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కాబట్టి జట్టులోకి ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే మెగా టోర్నీలో మనోడు దారుణంగా విఫలమవడమే కాకుండా.. గాయం కారణంగా మధ్యలోనే ఇంటికివచేశాడు.
2019 వన్డే ప్రపంచకప్ అనంతరం ఐపీల్ 2020, 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన చేశాడు. దాంతో ప్రతి మ్యాచ్ అనంతరం అతడు ట్రోలింగ్ భారిన పడేవాడు. ఇక ఐపీఎల్ 2022 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 1.40 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 4,13 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. గురువారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఏడు బంతులాడి కేవలం రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు దొరికిపోయాడు.
ఐపీఎల్ 2022లో మూడు మ్యాచులు ఆడిన విజయ్ శంకర్ 6.33 సగటుతో 19 పరుగులే చేశాడు. దాంతో శంకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రెండు పరుగులకే ఔట్ అవ్వడంతో శంకర్‌పై సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. 'ఆ విజయ్ శంకర్ ఎందుకురా బాబు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'క్రికెట్ ఆడకుండా విజయ శంకర్‌ను నిషేధించండి' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'శంకర్ త్రీడీ ప్లేయర్ అంటే నవ్వొస్తుంది', 'ఇంకా అతడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు', 'శంకర్‌ను తీసుకున్నారు కానీ,.. సురేష్ రైనాను తీసుకోలేదు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Vijay Shankar should be banned from playing cricket 😖
How is he given so many chances 🙏— Vivek Desai (@vivekdesai1993) April 15, 2022
విజయ్ శంకర్ విఫలమయినా.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (87 నాటౌట్; 52 బంతుల్లో 8×4, 4×6) బ్యాట్ ఝుళిపించాడు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్ జొస్ బట్లర్ (54; 24 బంతుల్లో 8×4, 3×6) టాప్ స్కోరర్. గుజరాత్ పేసర్ లూకి ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు.
#RRvsGT
Lord Vijay Shankar Supremacy.. 👑😎 pic.twitter.com/JDozdmRbIN— Siddharth patel 🔥 (@Siddhu__91) April 14, 2022
So Vijay Shankar is still playing cricket??#IPL2022 pic.twitter.com/weWHCteAQN
— Shubham (@kyalikhuyar_) April 14, 2022
Vijay shankar in gujrat titans 🙂.#RRvsGT pic.twitter.com/cjh1mT36EF
— Nagendra singh chouhan🥀💖 (@k_p_7773) April 14, 2022
Vijay Shankar was picked by a franchise but not Raina😳😳#RRvsGT pic.twitter.com/4UjPNM3k8n
— frozen🥶 (@ein_scofield) April 14, 2022
Also Read: Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరోసారి గాయం.. మూడు బంతులేసి డగౌట్ చేరుకున్న గుజరాత్ కెప్టెన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook