IPL 2022 Orange Cap Race: ఐపీఎల్ 2022లో దాదాపు 60 శాతం మ్యాచ్‌లు ముగిశాయి. ఒక్కొక్క మ్యాచ్ జరిగే కొద్దీ వివిధ కేటగరీల జాబితా మారుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ కీలకంగా భావించే ఆరెంజ్ క్యాప్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
ఐపీఎల్ 2022 టోర్నీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 47 మ్యాచ్‌ల వరకూ పూర్తయ్యాయి. ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు కీలకంగా మారింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవాలన్నా,ప్లేఆఫ్‌కు చేరాలన్నా అన్నింటా గెల్చుకుంటూ రావాలి. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్‌కు చేరుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు చేరుకున్నట్టే కన్పిస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క మ్యాచ్ జరిగే కొద్దీ వివిధ కేటగరీల జాబితాలో పేరు మారుతున్నాయి. స్థానాలు అటూ ఇటూ అవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఇదే మ్యాచ్‌లో డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హార్ధిక్ పాండ్యాను దాటేశాడు. ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లు ఆడి..316 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్‌లో రాలేకపోతున్నాడు.
ఆరెంజ్ క్యాప్ జాబితాలో..
ఇక ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఇప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. జోస్ పది మ్యాచ్‌లు ఆడి..588 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక రెండవ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు చెందిన కేఎల్ రాహుల్ 451 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు రాహుల్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక పంజాబ్‌కు చెందిన శిఖర్ ధావన్ 369 పరుగులతో మూడవ స్థానంలో నిలవగా..ఎస్ఆర్హెచ్కు చెందిన అభిషేక్ శర్మ 9 మ్యాచ్‌లు ఆడి 324 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పది మ్యాచ్‌లు ఆడి 324 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
జోస్ బట్లర్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు ఆర్ఆర్ జట్టుకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలుండటంతో కచ్చితంగా ఆరెంజ్ క్యాప్ అతడికేనని తెలుస్తోంది. ఎందుకంటే కేఎల్ రాహుల్‌కు బట్లర్‌కు 140 పరుగుల వరకూ వ్యత్యాసం కన్పిస్తుంది.
Also read: IPL 2022 Play Off Chances: చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఏ మేరకు, సాధ్యమయ్యేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.