Jos Buttler: జోస్ బట్లర్ సెంచరీ.. ముంబైకి భారీ లక్ష్యం!!

IPL 2022, MI vs RR. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసి.. ముంబైకి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 06:00 PM IST
  • జోస్ బట్లర్‌ సెంచరీ
  • ముంబైకి భారీ లక్ష్యం
  • ముంబై బోణీ కొట్టేనా
Jos Buttler: జోస్ బట్లర్ సెంచరీ.. ముంబైకి భారీ లక్ష్యం!!

Jos Buttler hits hundred, Mumbai Target is 194: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసి.. ముంబైకి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్‌ (100 : 68 బంతుల్లో 11×4, 5×6) సెంచరీ చేశాడు. షిమ్రోన్ హెట్‌మయర్‌ (35 : 14 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడగా.. సంజూ శాంసన్‌ (30) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. యశస్వీ జైస్వాల్‌ (1), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కీరన్ పొలార్డ్‌ ఓ వికెట్ తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌, స్టార్ బ్యాటర్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ త్వరగానే పెవిలియన్ చేరారు. జైస్వాల్‌ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయగా.. పడిక్కల్‌ను మిల్స్‌ వెనక్కి పంపాడు. ఈ సమయంలో జోస్ బట్లర్‌, సంజూ శాంసన్‌ జట్టును ఆదుకున్నారు. రెండు వికెట్లు పడ్డా.. ఈ జోడి దూకుడుగానే ఆడింది. బౌండరీల వర్షం కురిపిస్తూ.. పరుగుల వరద పారించారు. 

బాసిల్ తంపి వేసిన నాలుగో ఓవర్‌లో జోస్ బట్లర్‌ 0, 4, 6, 6, 4, 6 వరుసగా 5 బౌండరీలు బాది 26 పరుగులు పిండుకున్నాడు. ఆపై కూడా దూకుడు కొనసాగించాడు. మరోవైపు సంజూ శాంసన్‌ కూడా బ్యాట్ జులిపించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో రాజస్థాన్ స్కోర్ 100 దాటింది. 15వ ఓవర్లో శాంసన్‌ ఔట్ అయినా.. షిమ్రోన్ హెట్‌మయర్‌ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. 35 పరుగులు చేసిన హెట్‌మయర్‌ ఔట్ కాగా.. 19వ ఓవర్లో బట్లర్‌ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే మొదటి సెంచరీ కాగా.. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది రెండవ శతకం.

సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడుతాడనుకున్న జోస్ బట్లర్.. జస్ప్రీత్ బుమ్రా వేసిన బుల్లెట్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 200కు పైగా భారీ స్కోర్ చేస్తుందనుకున్న రాజస్థాన్.. 193 పరుగలకే పరిమితమైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (0), రియాన్ పరాగ్‌ (5), నవదీప్‌ సైని (2) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా, మిల్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. పొలార్డ్‌ ఓ వికెట్ తీశాడు. ఆఖరి రెండు ఓవర్లలోనే రాజస్థాన్ ఐదు వికెట్లు కోల్పోగా.. చివరి మూడు ఓవర్లలో 23 పరుగులే చేసింది. 

Also Read: Ugadi 2022: ఉగాది పర్వదినాన.. ముస్లిం భక్తులలో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం! ఎక్కడో తెలుసా?

Also Read: Dark Net: నిఘాకు చిక్కకుండా.. డార్క్‌ నెట్‌లో దర్జాగా మత్తుపదార్థల క్రయవిక్రయాలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News