Shah Rukh Khan heap praise on Andre Russell and Umesh Yadav: శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. భానుక రాజపక్స (31), కగిసో రబడ (25) కీలక పరుగులు చేశారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఉమేశ్ యాదవ్ (4/23) నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. హిట్టర్ ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.
పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 54 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో ఆండ్రీ రసెల్ సిక్సుల వర్షం కురిపించాడు. వరుస సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించాడు. ఏకంగా 8 సిక్సులు బాది మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. రసెల్ ఒక్కో సిక్స్ బాడుతుంటే.. మైదానంలో ఫాన్స్ సందడి చేశారు. కోల్‌కతా అభిమానులు అయితే ఈలలు వేస్తూ.. గంతులు వేశారు.
ఆండ్రీ రసెల్ ఆటకు కోల్‌కతా నైట్ రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్ ఫిదా అయ్యాడు. 'నా మిత్రుడు ఆండ్రీ రసెల్‌కు తిరిగి స్వాగతం. బంతి చాలా ఎత్తుకు ఎగరడం చూసి చాలా కాలమైంది. ఉమేష్ యాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. ఉమేష్.. వావ్. శ్రేయస్ అయ్యర్, టీమ్ బాగా ఆడారు. హ్యాపీ నైట్ బాయ్స్' అని షారుఖ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Welcome back my friend @Russell12A so long since saw the ball fly so high!!! It takes a life of its own when U hit it Man! And @y_umesh wow! To @ShreyasIyer15 & team well done.Have a happy nite boys.
— Shah Rukh Khan (@iamsrk) April 1, 2022
మ్యాచ్ అనంతరం ఆండ్రీ రసెల్ మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనేం చేయగలనో నాకు బాగా తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నపుడు సామ్ బిల్లింగ్స్ క్రీజులో నిలబడి స్ట్రైక్ రొటేట్ చేశాడు. ముందుగా కుదురుకోడానికి సమయం తీసుకున్నా తర్వాత హిట్టింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ధాటిగా ఆడి మ్యాచ్‌ను గెలిపించా. జట్టు అవసరాలకు ఏదైనా చేయడానికి సిద్ధం. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. కెప్టెన్ అంగీకరిస్తే అందుకు సంతోషిస్తా' అని తెలిపాడు.
Also Read: Petrol Diesel Price Hike: మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు.. 12 రోజుల్లో రూ. 7.20 పెంపు!
Also Read: Omicron XE Variant: ఇది మరీ ప్రమాదకరమా..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.