Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

Kane Williamson Likely to miss Rajasthan Royals Match. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 ఆరంభ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 05:32 PM IST
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌
  • ఆరంభ మ్యాచ్‌కు కేన్‌ దూరం
  • కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌
Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

Kane Williamson Likely to miss First Match for Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022కు సమయం దగ్గరపడుతోంది. మెగా లీగ్ మార్చి 26న ప్రారంభం కానుంది. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక తెలుగు జట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రయాణం మార్చి 29న ఆరంభం కానుంది. ఎస్‌ఆర్‌హెచ్ త‌న తొలి మ్యాచ్‌ను పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచుకు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడని తెలుస్తోంది. 

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 ఆరంభ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మోచేతి గాయంతో బాధపడుతున్న కేన్ మామ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. తాజాగా కేన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో చేరి ప్రాక్టీస్ చేస్తున్నా.. ఫిట్‌నెస్‌ దృష్ట్యా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని సమాచారం. ఇక ఏప్రిల్ 4న పుణే సూప‌ర్ జెయింట్స్‌ జట్టుతో జరిగే రెండో మ్యాచుకు కేన్ అందుబాటులో ఉంటాడట. తొలి మ్యాచుకు భువనేశ్వర్‌ కుమార్‌ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడట. 

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను మోచేతి గాయం చాలా కాలంగా వేధిస్తోంది. 2021లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్, ఐపీఎల్ 2021 మొదటి లెగ్ ప్రారంభం మ్యాచులు మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌ ఆడలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత కేన్ తన మోచేయి గాయం కోసం హండ్రెడ్ క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత దక్షిణాఫ్రికా మరియు బంగ్లాదేశ్‌లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2022ల్లో అయినా అన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి. 

ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ 23 మందిలో ముగ్గురి ఆటగాళ్లను (కేన్ విలిమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్) వేలంకు ముందు అట్టిపెట్టుకోగా.. ఐపీఎల్ 2022 వేలంలో 20 మందిని కొనుగోలు చేసింది. నికోలస్ పూరన్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్ ప్లేయర్లను తీసుకుంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ఫజల్హాక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్. 

Also Read: RRR AP Tickets: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!!

Also Read: Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News