PBKS vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా సాగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో తెవాతియా విజృంభించాడు.
ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరే సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ 64 పరుగులు చేయగా..శిఖర్ ధావన్ 35, జితేష్ శర్మ 23, షారుక్ ఖాన్ 15 పరుగులు చేశారు.
ఆ తరువాత 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఓపెనర్‌గా బరిలో దిగిన శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శన ఆ టీమ్‌కు శుభారంభమిచ్చింది. ఏకంగా 96 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో శుభమన్ అత్యధిక స్కోర్ ఇదే. మ్యాచ్ చివరి వరకూ గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయమనే దిశగా సాగింది. చివర్లో శుభమన్ గిల్ అవుట్ కావడం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మిల్లర్ తొందరపాటు కారణంగా రనవుట్ కావడంతో మ్యాచ్ తిరిగి పంజాబ్ దిశగా సాగింది. చివరి వరకూ విజయం దిశగా వచ్చినా..చివర్లో గుజరాత్ టైటాన్స్ నిరాశకు లోనైంది. ఎందుకంటే చివర్లో ఇక ఓటమి తప్పదని అన్పించింది. చివర్లో కేవలం 2 బంతులు మిగిలాయి. 12 పరుగులు అవసరమయ్యాయి. ఇక విజయం సాధ్యం కాదనే అనుకున్నారంతా..అంతే ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న తెవాతియా వరుసగా రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాడు.
Also read: PBKS vs GT Dream11 Prediction: పంజాబ్‌లోకి సన్‌రైజర్స్ ఓపెనర్.. ఓటమెరుగని గుజరాత్! డ్రీమ్ 11 టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook