DC vs MI: స్వయం కృతాపరాధం..తప్పుడు నిర్ణయాలు ఆ జట్టును కీలకమైన సమయంలో ఓటమిపాలు చేశాయి.ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమణకు దారి తీశాయి. చేసిన తప్పు తెలుసుకోకుండా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేసిన జట్టు సారధిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2022లో కీలకమైన లీగ్ దశ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయంతో ఢిల్లీ కేపిటల్స్ పరాజయం పాలైంది. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకునేలా చేశాయి. ఆర్సీబీకు ప్లే ఆఫ్ మార్గం సుగమమైంది. ఇదంతా ఢిల్లీ కేపిటల్స్ జట్టు స్వయం కృతాపరాధమే కాకుండా జట్టు సారధిగా ఉన్న రిషభ్ పంత్ తప్పుడు నిర్ణయం ఫలితమేనంటున్నారు నెటిజన్లు.
13 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లలో ఉంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు. ఆటు ఆర్సీబీ 14 మ్యాచ్‌లలో 8 గెలిచి 16 పాయింట్లు సాధించింది. ఢిల్లీ కేపిటల్స్ 14వ ఆఖరి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో జరిగింది. ఇది ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే..రన్‌రేన్ కారణంగా ఆర్సీబీని వెనక్కి నెట్టి ఢిల్లీ కేపిటల్స్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరేది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులే చేయగలిగింది. అయినా సరే ప్రారంభంలో పటిష్టమైన బౌలింగ్‌తో విజయానికి చేరువలో వచ్చింది.
ఓ దశలో ముంబై ఇండియన్స్ స్కోరు 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 95 పరుగులే చేసింది. టీమ్ డేవిడ్ బరిలో దిగాడు. శార్దూల్ వేసిన 15వ ఓవర్ తొలిబంతికే టీమ్ డేవిడ్ అవుటయ్యాడు. బంతి క్లియర్ ఎడ్జ్ తీసుకుని కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ వెళ్లింది. అంపైర్ నాటవుట్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ డీఆర్ఎస్ అప్పీల్ చేస్తారని భావించారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా రిషభ్ పంత్‌కు డీఆర్ఎస్ తీసుకోమని పదే పదే చెప్పినా..రిషభ్ పట్టించుకోలేదు. ఎడ్జ్ తీసుకోలేదని భావించాడు. ఇదే భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణమైంది. ఆ తరువాత టీమ్ డేవిడ్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ జట్టును విజయానికి చేరువ చేశాడు.
రిషభ్ పంత్ తప్పుడు నిర్ణయం ఫలితం ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. ఇది చాలదన్నట్టు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు మరింత కోపాన్ని కల్గించాయి. బంతి ఎడ్ద్ తీసుకున్నట్టు తనకు అన్పించినా..సర్కిల్‌లో ఉన్నవారంతా కాదనే భావనలో ఉన్నారని..అందుకే తీసుకోలేదని చెప్పాడు. తను చేసిన తప్పుడు నిర్ణయాన్ని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేసి విమర్శల పాలవుతున్నాడు రిషభ్ పంత్. ఎందుకంటే డీఆర్ఎస్ విషయంలో ఎప్పుడూ వికెట్ కీపర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలిసే అవకాశం లేదు. ఇక్కడ వికెట్ కీపర్, క్యాచ్ తీసుకుంది, జట్టు కెప్టెన్..మూడు రిషబ్ పంతే. మరి డీఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకోకుండా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
Taking DRS at crucial time is not everyone’s cup of tea.
Rishabh Pant😭.
TIM DAVID you Beauty😘
RCB RCB #RCB #MIvsDC #Playoffs #DCvsMI #IPL2022 pic.twitter.com/SOhCllnzUS— Humza Sheikh (@Sheikhhumza49) May 21, 2022
మొత్తానికి ఢిల్లీ కేపిటల్స్ జట్టు మ్యాచ్‌ను చేజేతులారా ఓడిపోయింది. కీలకమైన డూ ఆర్ డై మ్యచ్‌లో తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ భారీ మూల్యాన్నే చెల్లిస్తాయి. అదే జరిగింది. ఆర్సీబీకు ప్లే ఆఫ్ కు చేర్చింది. ఢిల్లీ ఇంటి దారి పట్టింది.
Also read: Facts About PV Sindhu: ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook