Dwayne Bravo: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డ్వేన్‌ బ్రావో.. ఎవరికీ సాధ్యం కాదేమో ఇగ?

Dwayne Bravo Becomes the Highest Wicket Taker in IPL. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో రికార్డు నెలకొల్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 01:05 PM IST
  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డ్వేన్‌ బ్రావో
  • బ్రావో ఖాతాలో 171 వికెట్లు
  • ఎవరికీ సాధ్యం కాదేమో ఇగ
Dwayne Bravo: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డ్వేన్‌ బ్రావో.. ఎవరికీ సాధ్యం కాదేమో ఇగ?

Dwayne Bravo Becomes the Highest Wicket Taker in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో రికార్డు నెలకొల్పాడు. గురువారం రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ హుడాను ఔట్‌ చేయడం ద్వారా చెన్నై ఆల్‌రౌండర్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. దాంతో ఇప్పటివరకు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ పేరిట ఉన్న రికార్డు బద్దలు అయింది. 

ఐపీఎల్‌ 2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో డ్వేన్‌ బ్రావో మూడు వికెట్లు తీసి.. ముంబై ఇండియన్స్‌ మాజీ పేసర్ లసిత్‌ మలింగ (170) రికార్డును సమం చేశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ హుడాను ఔట్‌ చేసి.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో రికార్డులోకి ఎక్కాడు. బ్రావో ఖాతాలో ప్రస్తుతం 171 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో బ్రావో, మలింగ తర్వాత అమిత్‌ మిశ్రా (166), పీయుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150)లు వరుసగా ఉన్నారు.

ఐపీఎల్‌లో 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆడిన ల‌సిత్ మ‌లింగ అన్ని సీజ‌న్‌లలోనూ ముంబై ఇండియ‌న్స్‌ తరఫునే ఆడాడు. మ‌లింగ మొత్తం 122 మ్యాచ్‌లు ఆడి.. 170 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఐపీఎల్‌లో 2008 నుంచి ఆడుతున్న డ్వేన్ బ్రావో 153 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు తీశాడు. బ్రావో మినహా టాప్ 5లో ఉన్న ఎవరు కూడా ప్రస్తుతం మ్యాచులు ఆడడం లేదు కాబట్టి.. చెన్నై ఆల్‌రౌండర్ రికార్డు ఇప్పట్లో బద్దలు అయ్యే అవకాశం లేదు. 

Also Read: Dhoni Gambhir: మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీని కలిసిన గౌతమ్ గంభీర్‌.. ఏం మాట్లాడుకున్నారో!!

Also Read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News