కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్నా ఏ ఆటంకం లేకుండా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించారు. కానీ ఐపీఎల్ 2021 భారత్‌లో నిర్వహించడం తప్పిదమని, సరైన నిర్ణయం కాదని సీజన్ మధ్యలోనే నిలిచిపోవడం తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ వాయిదా పడిన వెంటనే భారత క్రికెటర్లు, దేశవాలీ ఆటగాళ్లు వెంటనే తమ ఇళ్లకు చేరుకున్నారు.
విదేశీ ఆటగాళ్లకు కోవిడ్19 మహమ్మారి చుక్కలు చూపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆటగాడైతే ఏకంగా కంటతడి పెట్టుకున్నాడట. తన జీవితంలో అవి చాలా భయంకరమైన రోజులంటూ ఐపీఎల్ 2021 (IPL 2021) రోజులను గుర్తుకు చేసుకున్నాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫర్ట్ తన కష్టాల్ని వివరించాడు. మరోవైపు ఐపీఎల్ ముగిసిన తరువాత చివరగా ఇక్కడి నుంచి బయలుదేరిన విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేయగా తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కడినే మరికొన్ని ఆగాల్సి వచ్చిందన్నాడు. తమ దేశానికి చేరుకున్న తరువాత ఆక్లాండ్‌లో క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నట్లు వెల్లడించాడు.
Also Read: COVID-19: 2000 Oxygen concentrators విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చిన BCCI
కరోనా సోకిన తరువాత ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదన్నాడు. కానీ రోజులు చాలా భయానకంగా గడిచిపోయాయని గుర్తు చేసుకున్నాడు. భారత్‌లో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదని తెలియడంతో మరింత భయాందోళనకు గురైనట్లు కివీస్ ఆటగాడు టిస్ సీఫర్ట్ తెలిపాడు. భారత్‌లో అలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదనిన్నాడు. ఆటగాళ్లు, కోచ్, సిబ్బందిలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ సీజన్ 14ను నిరవధిక వాయిదా వేసింది. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి చేరుకోవడంలో ఆ దేశ ప్రభుత్వాల ఆంక్షలు అడ్డంకిగా మారాయి.
Also Read: ICC WTC Final: టీమిండియా ఓపెనర్ Rohit Sharmaకు మాజీ కోచ్ వార్నింగ్
What gets Tim Seifert through days in quarantine? 🥘
He’ll fill you in as he counts down to his MIQ release mid next week 👍#CricketNation #Cricket pic.twitter.com/QO9BK7U1bf
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021
ఓ ఆటగాడిగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని, అక్టోబర్ నెలలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వస్తానని చెప్పడం గమనార్హం. బయో బబుల్ వాతావరణంలో భద్రత ఉన్నట్లు తాను భావించానని చెప్పుకొచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పొట్టి ప్రపంచ కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్‌లో సాధ్యం అవకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
Also Read: Sagar Rana Murder Case: సాగర్ రాణాపై దాడిని వీడియో తీయించిన రెజ్లర్ Sushil Kumar
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook