Shreyas Iyer Injury: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ, ఐపీఎల్ 2021కు శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్

Delhi Capitals Captain Shreyas Iyer Injury | ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు అయ్యర్. ప్రస్తుతానికి తదుపరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండదని బీసీసీఐ అధికారి ఒకరి తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 24, 2021, 07:22 PM IST
  • శ్రేయస్ అయ్యర్ తదుపరి వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు
  • ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు
  • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది
Shreyas Iyer Injury: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ, ఐపీఎల్ 2021కు శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్

టీమిండియా కీలక బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తదుపరి వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు అయ్యర్. ఫిజియో సాయంతో మైదానాన్ని వీడిన అయ్యర్‌ను వైద్యులు పరీక్షించారు. అయితే ప్రస్తుతానికి తదుపరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండదని బీసీసీఐ అధికారి ఒకరి తెలిపారు.

శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021(IPL 2021) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆందోళన మొదలైంది. అయ్యర్‌కు మరిన్ని టెస్టులు జరిపిన తరువాత ఎడమ భుజానికి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని సమాచారం. ఇదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. సర్జరీ జరిగితే కనీసం రెండు నెలలపాటు అయ్యర్ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్ 14 సీజన్‌కు అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Shikhar Dhawan: వన్డేల్లో వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీల ఈ రికార్డు సమం చేసిన శిఖర్ ధావన్

అయ్యర్ స్థానంలో సూర్యకుమార్..
తొలి వన్డేలో జానీ బెయిర్‌స్టో కొట్టిన బంతిని ఆపే యత్నంలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి స్థానంలో రెండు, మూడు వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది. ఇటీవల టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో గత మూడు, నాలుగేళ్లుగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఎట్టకేలకు టీమిండియా(Team India)కు ఎంపికయ్యాడు సూర్యకుమార్ యాదవ్.

Also Read: India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై ఇండియా ఘన విజయంపై విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

రోహిత్ గాయంపై అప్‌డేట్.. 
తొలి వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం గాయపడ్డాడు. ఇంగ్లాండ్ కీలక పేసర్ మార్క్ వుడ్ సంధించిన బంతి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కుడి మోచేతికి బలంగా తగిలింది. నొప్పిని భరిస్తూనే రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో మైదానంలో రెండు పర్యాయాలు ట్రీట్‌మెంట్ సైతం తీసుకున్నాడు. హిట్ మ్యాన్ గాయం అంత పెద్దదికాదని తేలింది. దాంతో తదుపరి వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆడతాడని స్పష్టమైంది.

Also Read: India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్‌ని మలుపు తిప్పిందెవరంటే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News