IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు

IPL 2021 Suspended | ఆటగాళ్లకు సైతం కరోనా సోకడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో తొలిసారిగా వాయిదా పడింది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు(Cricket Australia) టీ20 సిరీస్‌ల కోసం ముందుగానే ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సూచించింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 6, 2021, 12:27 PM IST
IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు

IPL 2021: కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత పెరగడం, ఆటగాళ్లకు సైతం కరోనా సోకడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో తొలిసారిగా వాయిదా పడింది. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. కరోనా భయంతో కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం కాస్త ముందుగానే స్వదేశానికి వెళ్లాలని బయలుదేరారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు(Cricket Australia) టీ20 సిరీస్‌ల కోసం ముందుగానే ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సూచించింది.

టీ20 లీగ్స్, సిరీస్‌లు ఆడేందుకుగానూ ఆటగాళ్లు ముందుగానే మానసికంగా సన్నద్ధమవ్వాలని, ప్రాక్టిస్ సైతం చేయడం మొదలుపెట్టాలిన ఆస్ట్రేలియా(Australia) క్రికెటర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ క్రికెటర్లకు సూచించాడు. మే 15 తరువాత ఆస్ట్రేలియా ప్రయాణ ఆంక్షలపై నిషేధం ఎత్తివేయనుంది. భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నిషేధం విధించడం తెలిసిందే. ఇకనుంచి ఆటగాళ్లు ఏ సిరీస్‌, లీగ్, టోర్నీలకైనా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో తన మనసులో మాటను టాడ్ గ్రీన్‌బర్గ్ బహిర్గతం చేశాడు.

Also Read: IPL 2021: భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే అతిపెద్ద తప్పిదమంటూ మాజీ కెప్టెన్ ఆగ్రహం

ప్రస్తుతం 38 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు, సిబ్బంది భారతదేశంలో ఉన్నారు. ఐపీఎల్ 2021(IPL 2021) వాయిదా పడిన కారణంగా వారు భారత్ నుంచి శ్రీలంక, లేదా మాల్దీవులకు వెళ్లి ఉంటారు. అక్కడి నుంచి మే 15 తరువాత స్వదేశమైన ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. ఆసీస్(Cricket Australia) క్రికెటర్లు అత్యుత్తమ అథ్లెట్లు, ఉత్తమ ఆటగాళ్లు, అదే సమయంలో మంచి వ్యక్తులు, తండ్రులు, భర్తలు అని గుర్తుంచుకోవాలన్నాడు. కోవిడ్19 తెచ్చిన పరిస్థితి, ఈ అనుభవాన్ని వారు జీవితంలో మరిచిపోరని తాను భావిస్తానని చెప్పాడు. 

Also Read: IPL 2021: CSK జట్టులో కరోనా కలకలం, బ్యాటింగ్ కోచ్ Michael Husseyకి కరోనా పాజిటివ్

ఏది ఏమైనా సరే తమ ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు ఆరోగ్యంగా, భద్రతతో తిరిగి చేరుకునేలా చేయడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్నవారితో పోల్చితే బయట ఉన్నవారికి ప్రస్తుతం అంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేవు. అయితే కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆస్ట్రేలియా క్రికెటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ ధీమా వ్యక్తం చేశాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News