IPL 2021 Auction sold and unsold players list: ఐపీఎల్ 2021 వేలంలో ఎవరెంత ధర పలికారు..ఎవరు అమ్ముడుపోలేదు

IPL 2021 Auction sold and unsold players list: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 వేలంలో ధర పలకగా..ఇంకొందరు క్రీడాకారులైతే బేసిక్ ధర కూడా పలకలేదు. ఐపీఎల్ వేలంలో ఎవరు అమ్ముడయ్యారు..ఎవరు కాలేదో తెలుసుకుందాం...  

Last Updated : Feb 18, 2021, 09:45 PM IST
IPL 2021 Auction sold and unsold players list: ఐపీఎల్ 2021 వేలంలో ఎవరెంత ధర పలికారు..ఎవరు అమ్ముడుపోలేదు

IPL 2021 Auction sold and unsold players list: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 వేలంలో ధర పలకగా..ఇంకొందరు క్రీడాకారులైతే బేసిక్ ధర కూడా పలకలేదు. ఐపీఎల్ వేలంలో ఎవరు అమ్ముడయ్యారు..ఎవరు కాలేదో తెలుసుకుందాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ( Indian premier league 2021 ) సీజన్  కోసం చెన్నైలో వేలంపాట ( IPL 2021 Auction ) జరిగింది. కొంతమందికి అదృష్టం వరిస్తే..మరి కొంతమందికి దురదృష్టం వెంటాడింది. ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకుండా కొంతమంది క్రీడాకారులు మిగిలిపోయారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధికంగా ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ ధరకు అమ్ముడయ్యారు. రాజస్తాన్ రాయల్స్ జట్టు క్రిస్ మోరిస్‌ను అత్యధికంగా 16 .25 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. అంతకుముందు ఐపీఎల్ చరిత్రలో యువరాజ్ సింహ్  ఎక్కువ ధరకు అంటే 16 కోట్లకు అమ్ముడయ్యారు. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు.

శివమ్ దూబేను రాజస్తాన్ రాయల్స్ జట్టు ( Rajasthan royals team ) 4.40 కోట్లకు కొనుగోలు చేసింది. మొయీన్ అలీను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai superkings team ) 7 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. షాకిబ్ అల్ హసన్‌ను కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు 3.20 కోట్లకు వేలంలో పాడి సొంతం చేసుకుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 14.25 కోట్లకు పాడి సొంతం చేసుకుంది. స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేపిటల్స్ జట్టు 2.2 కోట్లకు సొంతం చేసుకుంది. ముస్తఫిజుర్ రెహమాన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఆడమ్ మిల్నేను ముంబాయి ఇండియన్స్ జట్టు (Mumbai indians team ) 3.20 కోట్లకు వేలంలో పాడి సొంతం చేసుకుంది. ఝాయ్ రిచర్ట్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు 14 కోట్లకు పాడి సొంతం చేసుకుంది. పీయూష్ చావ్లాను ముంబాయి ఇండియన్స్ జట్టు 2.40 కోట్లకు పాడి సొంతం చేసుకుంది. ఉమేష్ యాదవ్‌ను ఢిల్లీ కేపిటల్స్ జట్టు..బేసిక్ ధర కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. నాథన్ కల్టర్ నాయిల్‌ను ముంబై ఇండియన్స్ జట్టు 5 కోట్లకు వేలంలో పాడి దక్కించుకుంది. సచిన్ బేబీను రాయల్ ఛాలెంజర్స్ జట్టు బేసిక్ ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు 5.25 కోట్లకు దక్కించుకుంది. మరో దేశీయ ఆటగాడు గౌతమ్‌ను పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. 

IPL Auction 2021 Unsold players

రోవ్‌మ్యాన్ పోవ్లే, షాన్ మార్ష్, కోరీ అండర్సన్, డెరేన్ బ్రేవో, రేసీ వాన్, డేర్ డ్రసేన్, మాటిన్ గుప్తిల్, పవన్ నేగీలు ఈసారి అమ్ముడుపోలేదు. ఇందులో కొందరి బేసిక్ ధర తక్కువ ఉన్నా సరే ఏ ఫ్రాంచైజీ కొనుగోలుకు ముందుకు రాకపోవడం విశేషం.

Also read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News