భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సందర్భానుసారం ప్రశంసలు కురిపించే సెహ్వాగ్.. విమర్శించడంలోనూ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యువ సంచలనం రాహుల్ తెవాటియా (Rahul Tewatia)ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడిన బంతిని రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా (Rahul Tewatia) అద్భుతంగా అందుకున్నాడు. తెవాటియా అందుకున్న క్యాచ్ చూసి సెహ్వాగ్ ఫిదా అయ్యాడు. ఇక సోషల్ మీడియాకు పని చెప్పాడు. ‘రాహుల్ తెవాటియా ఏమైనా చేయగలడు. కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఒక్క అవకాశం దొరికితే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తెవాటియా టైమ్ నడుస్తుంది. ఈ సీజన్‌లో అతడు అద్భుతంగా సాగిపోతున్నాడంటూ’ సెహ్వాగ్ ట్వీ్ట్ చేశాడు.
Tewatia kuchh bhi kar sakte hain.
Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKC— Virender Sehwag (@virendersehwag) October 17, 2020
ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయాలలో తెవాటియా కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా సెప్టెంబర్ 27న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద 31 బంతుల్లో 55 పరుగులు చేయడంతో రాహుల్ తెవాటియా (RR player Rahul Tewatia) పేరు ఈ ఐపీఎల్‌లో మార్మోగిపోయింది. ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదేశాడు. అలాంటి తెవాటియాపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపిస్తూ.. కోవిడ్‌కు సైతం వ్యాక్సిన్ తయారుచేయగలడని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఎంతైనా వీరు కామెంట్లకు తిరుగులేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- Also Read : RR v RCB: విధ్వంసకర బ్యాటింగ్ తో విజయాన్ని అందించిన డి విలియర్స్
- Also Read : Sachin About Chris Gayle: యూనివర్సల్ బాస్కే చోటివ్వరా?: పంజాబ్ జట్టుకు సచిన్ చురకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe