DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer

శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కేకేఆర్ (Kolkata Knight Riders)పై విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు అంటున్నాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).

Last Updated : Oct 4, 2020, 08:44 AM IST
  • కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది
  • షార్జాలో బౌండరీలు చిన్నవిగా ఉంటాయని, లక్ష్యాన్ని కాపాడుకోవడం తేలిక కాదన్న శ్రేయస్ అయ్యర్
  • స్మార్ట్ వర్క్ మాత్రమే కాదు, హార్డ్ వర్క్ ఉంటేనే విజయాలు సాధ్యమంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2020)లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కేకేఆర్ (Kolkata Knight Riders)పై విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు అంటున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో అయ్యర్ మాట్లాడాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయని, తద్వారా ఎంత లక్ష్యాన్ని నిర్దేశించింనా, కాపాడుకోవడం తేలిక కాదన్నాడు. 

Also Read:  Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

ఓపెనర్ షా (68), శ్రేయస్ అయ్యర్ (88) హాఫ్ సెంచరీలు చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ప్రత్యర్థి కేకేఆర్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ‘ఇది చాలా అమేజింగ్ టోర్నమెంట్. షార్జాలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌండరీలు తక్కువ దూరం ఉంటాయి. ఎన్ని పరుగులు చేసినా ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తుందన్న భయం ఉంటుంది. చివరిసారిగా అండర్ 19 మ్యాచ్‌లు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. 

Also Read: Jonny Bairstow: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఇంగ్లాండ్ షాక్.. కోట్లలో నష్టం!

 

మ్యాచ్‌లు గెలవాలంటే స్మార్ట్ వర్క్‌తో పాటు హార్డ్ వర్క్ అవసరమని తెలుసు. అందుకే జిమ్‌కు తగినంత సమయాన్ని కేటాయిస్తాను. ఈ మ్యాచ్‌లో మొదట్నుంచీ బంతిని బాదడం మొదలుపెట్టాను. లేకపోతే పరిస్థితి చేయిదాటుతుంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చాం. బౌలింగ్‌లో సరైన సమయంలో మార్పులు చేయడం వల్ల కేకేఆర్‌పై విజయం సాధించగలిగామని’ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరించాడు.

Also Read: Robin Uthappa saliva on the ball: రాబిన్ ఉతప్ప.. ఇలాంటివి వద్దప్పా!

కాగా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లాడి 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ విజయం ముంగిట చతికిల పడింది. నిర్ఱీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News