Fastest Ball In IPL: డెల్ స్టెయిన్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఇతడే

Fastest Deliveries in IPL history | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు

Last Updated : Oct 15, 2020, 09:06 AM IST
  • పేసర్ నోర్జే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు
  • ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా పేసర్ నోర్జే నిలిచాడు
  • డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు రికార్డులు నోర్జే ఖాతాలోకి
Fastest Ball In IPL: డెల్ స్టెయిన్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఇతడే

దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే (Anrich Nortje) నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ (Dale Steyn) ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్ నోర్జే.

 

బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నోర్జే నిలిచాడు. ఆ మరుసటి బంతికే రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లు వేగవంతమైన బంతులతో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నోర్జే నిప్పులు చెరిగాడు.

 

ఐపీఎల్‌లో రెండో, మూడో వేగవంతమైన బంతులు బౌలింగ్ చేసిన బౌలర్‌గానూ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 155.2 కి.మీ/గంటకు, 154.7 కి.మీ/గంటకు వేగంగా బంతులను సంధించి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బంతులు సంధించి, ఒకే మ్యాచ్‌లో బౌర్ నోర్జే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నోర్జే 4–0–33–2 గణాంకాలతో రాణించాడు.

 

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతులు ఇవే (Fastest Deliveries in IPL history):

  • అన్రిచ్ నోర్జే 156.2 కి.మీ/గంటకు
  • అన్రిచ్ నోర్జే 155.2 కి.మీ/గంటకు
  • అన్రిచ్ నోర్జే 154.7 కి.మీ/గంటకు
  • డెల్ స్టెయిన్ 154.4 కి.మీ/గంటకు
  • కగిసో రబాడ 154.2 కి.మీ/గంటకు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News