ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో బుధవారం కింగ్స్ ఎలవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్ చేసింది. ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. దీంతో 187 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి పంజాబ్ 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మూడు పరుగుల తేడాతో పంజాబ్‌పై ముంబై విజయం సాధించింది.
మొదట కీరన్ పొలార్డ్ (50; 23 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు), కృనాల్ పాండ్య (32; 23 బంతుల్లో 4, 2సిక్సులు) మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. పంజాబ్ ఫాస్ట్‌బౌలర్ టై (4/16) గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అనంతరం లక్ష్య చేధనలో కేఎల్ రాహుల్ (94; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులు) పోరాడినా.. పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. కళ్లుచెదిరే బౌలింగ్‌తో ముంబైని గెలిపించిన బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ముంబైకిది ఆరో విజయం. ముంబై మ్యాచ్ సొంతం చేసుకుని ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్-11 పాయింట్ల పట్టిక
- సన్‌రైజర్స్ హైదరాబాద్-12మ్యాచులు-9విజయాలు -18 పాయింట్లు
- చెన్నై సూపర్ కింగ్స్- 12మ్యాచులు -8విజయాలు -16పాయింట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్- 13మ్యాచులు -7విజయాలు-14పాయింట్లు
- ముంబై ఇండియన్స్- 13మ్యాచులు-6విజయాలు-12పాయింట్లు
- రాజస్థాన్ రాయల్స్-13మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 13మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 12మ్యాచులు -5విజయాలు-10పాయింట్లు
- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 12మ్యాచులు-3విజయాలు-6పాయింట్లు