హోరాహోరీ ఐపీఎల్ పోరులో.. చెన్నై పై ముంబయిదే గెలుపు..!

ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.

Last Updated : Apr 29, 2018, 07:57 AM IST
హోరాహోరీ ఐపీఎల్ పోరులో.. చెన్నై పై ముంబయిదే గెలుపు..!

ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.

చెన్నై జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో సురేష్ రైనా (75 పరుగులు, 47 బంతుల్లో) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడినా జట్టు ఓటమితో తను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చెన్నై జట్టులో తెలుగోడు అంబటి రాయుడు (46 పరుగులు, 35 బంతుల్లో) కూడా బాగానే ఆకట్టుకున్నాడు. అయినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ముంబయి ఇన్నింగ్స్‌లో చెప్పుకోవాల్సింది సూర్యకుమార్ ఇన్నింగ్స్. చేసింది తక్కువ స్కోరైనా క్రీజులో ఉన్నంత సేపు క్రికెట్ అభిమానులను తన షాట్లతో అలరించాడు. ఎవిన్ లూయిస్‌తో కలిసి భాగస్వామిగా జట్టుకి విలువైన 69 పరుగులు కూడా అందించాడు. అయితే హర్భజన్ బౌలింగులో సూర్యకుమార్ అవుట్ అవ్వడంతో కథ మరో మలుపు తిరిగింది.

కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత బాగా పుంజుకున్నాడు. ప్రతీ బాల్‌ను బౌండరీకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు. స్కోరు బోర్డును పరుగులెత్తించడమే లక్ష్యంగా చేసుకున్నాడు. వరుసగా వికెట్లు పడినా.. చివరికి హార్దిక్ (16 నాటౌట్) సహాయంతో జట్టుకి విజయాన్ని అందించాడు. ముఖ్యంగా ఆఖరి రెండు ఓవర్లలో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 12 బంతుల్లో 22 పరుగులు అవసరం కాగా.. ఒక ఓవర్ ఉందనగానే రోహిత్ నాలుగు ఫోర్లు కొట్టి మ్యాచ్ చేజారకుండా ఒడిసి  పట్టుకున్నాడు. తన జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు.

Trending News