ఐపీఎల్ ప్రారంభ వేడుక తేదీని బీసీసీఐ ఎట్టకేలకు ఖరారు చేసింది. 7 ఏప్రిల్, 2018 తేదిన ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నట్లు ప్రకటించింది. ఈ సారి ఐపీఎల్లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. ముంబయి వాంఖడే స్టేడియంతో పాటు ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై), పీసీఏ స్టేడియం (మొహాలి), ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా), చినస్వామి స్టేడియం (బెంగళూరు), హోల్కర్ క్రికెట్ స్టేడియం (ఇండోర్), రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్), ఫిరోజ్ షా కోట్ల (ఢిల్లీ), సవాయ్ మాన్ సింగ్ స్టేడియం (జైపూర్) మొదలైన మైదానాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ సారి ఐపీఎల్లో తమ సత్తా చాటనున్నాయి.
Opening Ceremony of #IPL2018 to be organised in Mumbai's Wankhede Stadium on 7th April: BCCI Sources pic.twitter.com/5hpDvm3bSa
— ANI (@ANI) March 4, 2018