IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!

IND vs ENG: మహిళల ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా జట్టు మరో ఓటమిని చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ తో తలపడిన భారత జట్టు.. 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 03:33 PM IST
IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!

IND vs ENG: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. మౌంట్ మౌంగనీయ్ వేదికగా జరిగిన మ్యాచులో టీమ్ఇండియాపై ఇంగ్లీష్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు నమోదు చేసిన తొలి విజయం ఇదే కావడం గమనార్హం. 

తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఆది నుంచే భారత బ్యాటర్లను కట్టడి చేసింది. మొదటి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు టీమ్ఇండియాపై ఆధిపత్యం చలాయించారు.  ఈ నేపథ్యంలో భారత జట్టు కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆ తర్వాత 135 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు.. 31.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ఇండియా బౌలర్లలో మేగ్న సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఝులన్ గోస్వామి, రాజేశ్వరి, పూజ వస్త్రాకర్ చెరో వికెట్ సాధించారు. 

బ్యాటింగ్ లో తడబాటు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా బ్యాటర్లు తొలి ఓవర్ నుంచే తడబాటుకు లోనయ్యారు. స్మృతి మంధాన (35 రన్స్), రిచా ఘోష్ (33 పరుగులు), ఝులన్‌ గోస్వామి (20 రన్స్) బ్యాటింగ్ లో రాణించగా.. యాస్తిక భాటియా 8, మిథాలీరాజ్‌ 1, హర్మన్‌ ప్రీత్ కౌర్ 14, పూజ వస్త్రాకర్‌ 6, మేఘ్న సింగ్ 3 (నాటౌట్) పరుగులు సరిపెట్టుకున్నారు. 28 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన పరిస్థితిలో.. ఓపెనర్‌ స్మృతీ మంధాన, హర్మన్‌ ప్రీత్‌ కలిసి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

అయితే 86/7తో ఉన్న టీమ్‌ఇండియా 134 పరుగులు చేసేందంటే రిచా ఘోష్ - ఝులన్‌ జోడీనే కారణం. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఇదే భారీ భాగస్వామ్యం కావడం విశేషం. ఇంగ్లాండ్‌ బౌలర్లలో డీన్‌ 4, అన్య ష్రుబ్‌సోలె 2.. సోఫీ, కేట్‌ క్రాస్ చెరో వికెట్ తీశారు. 

Also Read: AUS VS PAK: 'కెప్టెన్ కమ్ థోర్.. కమ్ కమిన్స్'.. ఆసీస్ సారథిపై ట్రోల్స్..

Also Read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News