Team India Squad: టీమిండియా జట్టు ప్రకటన.. తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్ ఎవరంటే..?

Indias Squad for Last Two Test Matches and ODI Series vs Australia: ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులను గెలిచి టీమిండియా మంచి జోష్‌లో ఉంది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచిన కాసేపటికే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ప్రకటించారు. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 06:17 PM IST
Team India Squad: టీమిండియా జట్టు ప్రకటన.. తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్ ఎవరంటే..?

Indias Squad for Last Two Test Matches and ODI Series vs Australia: ఆసీస్‌తో జరిగే మూడు, నాలుగు టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌నే కొనసాగించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌ వంటి ప్లేయర్లకు చోటు దక్కుతుందని అందరూ భావించగా.. మరోసారి నిరాశే ఎదురైంది. అదేవిధంగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు కూడా జట్టుకు ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా వన్డే టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వగా.. జయదేవ్ ఉనద్కత్‌కు కూడా బీసీసీఐ చోటు కల్పించింది. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం అవ్వగా.. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది.

మొదటి వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్సీని చేపట్టడని బీసీసీఐ వెల్లడించింది. కుటుంబ కారణాల వల్ల తొలి వన్డేకు దూరమయ్యాడని.. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. టెస్టుల్లో అదరగొట్టిన అశ్విన్‌కు వన్డే జట్టులో చోటు కల్పించలేదు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌లకు జట్టులో అవకాశం కల్పించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలో జరగనుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, చివరిదైన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది. అంతకుముందు మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు మ్యాచ్, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.

చివరి రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎస్.గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆర్.జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఎస్.గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), ఆర్.జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
 

 

Also Read: MLA Sayanna Passed Away: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనంజా.. ఒకేసారి భారీగా నగదు జమ   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News