KL Rahul: ప్రేయసితో కేఎల్ రాహుల్ షాపింగ్.. కెమెరాకు దొరికిపోయాడు

KL Rahul And Athiya Shetty Spotted: కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టితో కలిసి మరోసారి కెమెరాకు చిక్కాడు. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 03:00 PM IST
KL Rahul: ప్రేయసితో కేఎల్ రాహుల్ షాపింగ్.. కెమెరాకు దొరికిపోయాడు

KL Rahul And Athiya Shetty Spotted: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న రాహుల్‌తో పాటు అతియా శెట్టి కూడా వెళ్లింది. మ్యాచ్‌లకు మధ్య దొరికిన గ్యాప్‌లో ఈ ప్రేమపక్షులు ఆస్ట్రేలియా నగరాల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా అడిలైడ్‌లో ఓ షాపింగ్‌ మాల్ వద్ద వీరిద్దరు కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహనికి రెండు కుటుంబాల పెద్దలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత జట్టు ఆడుతున్న మ్యాచ్‌లకు అతియా శెట్టి స్టేడియానికి హాజరై ఎంకరేజ్‌ చేస్తోంది.  

మరోవైపు టీమిండియా సెమీస్‌ చేరడంలో వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. తొలి మూడు మ్యాచ్‌లో రాహుల్ విఫలమవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని మాజీలు సూచించారు. అయినా మేనేజ్‌మెంట్ రాహుల్‌పై నమ్మకం ఉంచింది.

తనపై కెప్టెన్, మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాహుల్ దుమ్ములేపుతున్నాడు. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై వరుసగా హాఫ్ సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. కీలకమైన సెమీస్‌ పోరులో ఇంగ్లాండ్‌తో చెలరేగేందుకు ఉత్సాహంగా రెడీ అవుతున్నాడు. ఈ డాషింగ్ ఓపెనర్ క్రీజ్‌లో పాతుకుపోతే బౌలర్లను ఏ స్థాయిలో ఊచకోత కోస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
కేఎల్ రాహుల్, అతియా శెట్టి వచ్చే ఏడాది జనవరి నెలలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మహారాష్ట్రంలో ఈ ప్రేమజంట ఏడు అడుగులు వేయనుందని అంటున్నారు. ఇప్పటికే ముంబైలో ఈ లవ్‌బర్డ్స్‌ ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత తాము కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోనే కాపురం మొదలుపెట్టనున్నారు. గతంలో క్రికెట్‌తో రాహుల బిజీగా ఉండగా.. అతియానే ఇంటి పనులు చూసుకుంది.

Also Read: IND vs ENG: వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మంచి మనసు.. ఇప్పటం బాధితులకు రూ.లక్ష సాయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News