India vs West Indies: అమెరికాలోనే యధావిధిగా టీ20 మ్యాచ్‌లు..విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన..!

India vs West Indies: కరేబియన్ గడ్డపై భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌ జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు టీ20ల నిర్వహణపై క్లారిటీ వచ్చింది. 

Written by - Alla Swamy | Last Updated : Aug 4, 2022, 05:42 PM IST
  • కరేబియన్ గడ్డపై టీమిండియా
  • ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం
  • ఎల్లుండి నాలుగో టీ20 మ్యాచ్
India vs West Indies: అమెరికాలోనే యధావిధిగా టీ20 మ్యాచ్‌లు..విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన..!

India vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌లు అమెరికాలో జరగనున్నాయి. ఫ్లోరిడా వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగుతాయని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలోనే జరగాల్సి ఉంది. ఐతే ఆటగాళ్ల వీసాల ప్రక్రియలో జాప్యం జరగడంతో వెస్టిండీస్‌లోనే నిర్వహించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. చివరకు ఆటగాళ్లకు యూఎస్ వీసాలు మంజూరు అయ్యాయి.

దీంతో యథావిధిగా ఇరు జట్ల ఆటగాళ్లు అమెరికా వెళ్లనున్నారు. అక్కడే చివరి రెండు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. గయనా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ జోక్యంతో వీసాలు త్వరగా వచ్చాయని విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. తొలి మ్యాచ్‌ బ్రియాన్ లారా స్టేడియంలో నిర్వహించారు. రెండు, మూడు టీ20 మ్యాచ్‌లను సెయింట్ కిట్స్‌లో జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఆటగాళ్లంతా అక్కడ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ఐతే వీసాల మంజూరులో జాప్యం చోటుచేసుకుంది.

టీ20 సిరీస్ ఆరంభం నుంచి నిర్వహణ లోపం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌ అనంతరం ట్రినిడాడ్ నుంచి ఆటగాళ్లు లగేజీ వచ్చేందుకు ఆలస్యమయ్యింది. దీంతో రెండు, మూడో మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇందులో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఐదు టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా..రెండో మ్యాచ్‌లో విండీస్ గెలిచింది. మూడో టీ20లో సూర్యకుమార్‌ మెరుపులతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

Also read:New CJI: కొత్త సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్..ప్రతిపాదించిన జస్టిస్ ఎన్వీ రమణ..!

Also read:Rain Alert: తెలంగాణ ప్రజలారా బీఅలర్ట్..మరో మూడు వారాలపాటు ఇక వానలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News