India vs West Indies: సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. చెలరేగిపోయిన ప్రసిద్ధ్‌ కృష్ణ!

IND vs WI: కొత్త పేసర్‌ ప్రసిద్ధ్‌ బౌలింగ్‌తో విండీస్‌తో జరిగిన సెకెండ్‌ వన్డేలో భారత్‌ విజయం సాధించింది. ప్రసిద్ధ్‌కు తోడుగా శార్దూల్, చాహల్‌, సిరాజ్‌, హుడా కూడా నిలవడంతో విండీస్‌ 193 రన్స్‌కే ఆలౌట్‌ చేయగలిగింది టీమిండియా.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 10:35 PM IST
  • భారత్‌, విండీస్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం
  • 44 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
  • 193 పరుగులు తీసిన విండీస్‌
  • సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్‌ సేన
India vs West Indies: సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. చెలరేగిపోయిన ప్రసిద్ధ్‌ కృష్ణ!

India vs West Indies 2nd ODI 2022: భారత్‌, విండీస్‌ మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 రన్స్‌ చేసి... ప్రత్యర్థికి నామమాత్రపు టార్గెట్‌ ఇచ్చింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ 64 రన్స్‌తో, కేఎల్‌ రాహుల్‌ 49 పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లంతా నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్స్‌లలో అల్జరీ జోసఫ్‌, ఓడియన్‌ స్మిత్‌ తలో రెండు వికెట్లు తీశారు. రోచ్‌, హోల్డర్‌, హొసేన్‌, అలెన్‌లు ఒక్కొక్క వికెట్‌ చొప్పున పడగొట్టారు. 

తర్వాత బరిలోకి దిగిన విండీస్‌ 46 ఓవర్లలో 193 రన్స్‌ చేసి ఆలౌటైంది. దీంతో వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియా విజయంలో ప్రసిద్ధ్‌ కృష్ణ ఎంతో కీలకంగా వ్యవహరించాడు.

పేసర్‌ ప్రసిద్ధ్‌ బౌలింగ్‌తో చెలరేగడం వల్లే భారత్ విజయం సొంతం చేసుకుంది. ప్రసిద్ధ్‌ నాలుగు వికెట్లు తీయగా, శార్ధూల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. చహల్‌, సిరాజ్‌, సుందర్‌, దీపక్ హుడా తలో వికెట్‌ తీశారు.

 

విండీస్ ప్లేయర్స్‌లో అత్యధికంగా షమా బ్రూక్స్‌ 44 రన్స్‌, హోసెయిన్‌ 34 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డేల సిరీస్‌ను రోహిత్‌ సేన ఇప్పటికే గెలుచుకున్నా... నామ మాత్రంగా జరగాల్సిన థర్డ్ వన్డే ఈ నెల 11న జరగనుంది.

Also Read: Virat Kohli Century: స్పెషల్ మ్యాచులోనూ విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన.. నిరాశలో ఫాన్స్! సెంచరీ ఇక కలనేనా?!!

Also Read: Gujarat Titans: అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News