India vs South Africa: టీ20 మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం

India vs South Africa: దక్షిణాఫ్రికాపై వర్సెస్ టీమ్ ఇండియా మూడవ టీ20లో ఇండియా 48 పరుగుల ఘన విజయం సాధించింది. వరుస రెండు ఓటముల తరువాత మూడవ మ్యాచ్ విజయంతో సిరీస్ 2-1 ఆధిక్యత సాధించింది

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 14, 2022, 11:35 PM IST
 India vs South Africa: టీ20 మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం

India vs South Africa: దక్షిణాఫ్రికాపై వర్సెస్ టీమ్ ఇండియా మూడవ టీ20లో ఇండియా 48 పరుగుల ఘన విజయం సాధించింది. వరుస రెండు ఓటముల తరువాత మూడవ మ్యాచ్ విజయంతో సిరీస్ 2-1 ఆధిక్యత సాధించింది

మరోసారి టాస్ ఓడిన టీమ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరపున ఇషాన్ కిషన్ మరోసారి విజృంభించి 35 బంతుల్లో 54 పరగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం 14 పరుగులకే వెనుదిరిగాడు. ఓపెనర్ రుతురాత్ గైక్వాడ్ 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో ఇండియా ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. 

ఆ తరువాత 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. నాలుగవ ఓవర్‌లో కెప్టెన్ బవుమా అవుటవగా...6వ ఓవర్‌లో హెండ్రిక్స్ అవుటయ్యాడు. 7వ ఓవర్ ప్రారంభంలో మూడవ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా. మరో రెండు ఓవర్లు ముగిసేసరికి మరో వికెట్ కోల్పోయింది. 11వ ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తరువాత కాస్సేపు నిలకడగా ఆడుతుందనగా..15వ ఓవర్‌లో క్లాసెన్ అవుటయ్యాడు. ఇలా వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది. 20వ ఓవర్ మరో ఐదు బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా చివరి వికెట్ కోల్పోయింది.131 పరుగులకు ఆలవుట్ అయింది. టీమ్ ఇండియా వరుస రెండు ఓటముల తరువాత విజయం నమోదు చేసి దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. ఇవాళ్టి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచుంటే..సిరీస్ కైవసమయ్యేది. 

Also read: IND vs SA: టీమిండియాదే బ్యాటింగ్.. గెలిస్తేనే నిలిచేది! సందడిగా విశాఖ మైదానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News