IND vs SA: దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్‌ పేసర్‌ ఔట్! భారత బ్యాటర్లకు పండగే!!

భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో టెస్ట్ సిరీస్‌ నుంచి అతడు తప్పుకున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 07:43 PM IST
  • గాయంతో దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ ఔట్
  • టెస్ట్ సిరీస్‌ నుంచి తప్పుకున్న అన్రిచ్ నోర్జ్
  • భారత బ్యాటర్లకు పండగే
IND vs SA: దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్‌ పేసర్‌ ఔట్! భారత బ్యాటర్లకు పండగే!!

India vs South Africa: Pacer Anrich Nortje Ruled Out Of Test Series due to injury: భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా (South Africa) జట్టుకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ (Anrich Nortje) టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో టెస్ట్ సిరీస్‌ నుంచి అతడు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ప్రకటించింది. నోర్జ్ స్థానంలో టెస్టు సిరీస్‌కు ఎవరిని ఎంపికచేయడం లేదని సీఎస్‌ఏ పేర్కొంది. మంచి ఫామ్‌లో ఉన్న నోర్జ్ దూరం కావడం ప్రొటీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు సొంతగడ్డపై తన వేగంతో బెంబేలెత్తించే నోర్జ్.. టెస్టులకు దూరమవడం భారత బ్యాటర్లకు కలిసిరానుంది.

'దక్షిణాఫ్రికా జట్టుకు కీలక బౌలర్‌గా ఉన్న అన్రిచ్ నోర్జ్ టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడం పెద్ద లోటు. అతడి స్థానాన్ని భర్తీచేయలేం. వరుస గాయాలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక వన్డే సిరీస్‌ సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడా లేదో చెప్పలేని పరిస్థితి. నోర్జ్ స్థానంలో టెస్టు సిరీస్‌కు ఎవరిని ఎంపిక చేయలేదు. కగిసో రబాడ, బీరన్‌ హెండ్రిక్స్‌, గ్లెంటన్‌ స్టుర్‌మాన్‌, డ్యుయాన్నే ఒలివర్‌, సిసండా మగాలా లాంటి నాణ్యమైన పేసర్లు మాకు అందుబాటులో ఉన్నారు. వియాన్‌ ముల్డర్‌, మార్కో జాన్సెన్‌ లాంటి పేస్‌ ఆల్‌రౌండర్లు మాకు ఉన్నారు' అని సీఎస్‌ఏ పేర్కొంది. 

Also Read: Deepika Padukone: రణబీర్ కపూర్‌కు కండోమ్‌లను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న దీపికా పదుకొనే.. ఎందుకో తెలుసా?

2021లో అన్రిచ్ నోర్జ్ (Anrich Nortje) మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో 20.76 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 28 ఏళ్ల నోర్జ్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా (South Africa) 12 టెస్టులు ఆడి 47 వికెట్లు తీశాడు. 12 వన్డేలు, 16 టీ20లు కూడా ఆడాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా బంతిని నిలకడగా విసిరే సామర్థ్యం అతడికి ఉంది. దక్షిణాఫ్రికా లాంటి బౌన్సీ పిచ్‌లలో మరింత చెలరేగే అవకాశం ఉంది. కానీ గాయం కారణంగా దక్షిణాఫ్రికా అతడి సేవలు కోల్పోయింది. ఐపీఎల్ (IPL) ద్వారానే నోర్జ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020, 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) తరఫున ఆడాడు. రెండు సీజన్లు అద్భుతంగా రాణించడంతో ఐపీఎల్ 2022కి ముందు ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకుంది.

Also Read: కుల్దీప్ యాదవ్‌ను నంబర్‌ 1 అనడంతో తట్టుకోలేకపోయా.. బస్సు కింద పడేసినట్లుగా అనిపించింది: అశ్విన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

 

Trending News