India vs South Africa: చెలరేగిన టీమిండియా ఆటగాళ్లు..దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..!

India vs South Africa: ఢిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 9, 2022, 09:47 PM IST
  • తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్
  • దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
  • అలరించిన ఇషాన్‌ కిషాన్
India vs South Africa: చెలరేగిన టీమిండియా ఆటగాళ్లు..దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..!

India vs South Africa: ఢిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. భారత ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 76 పరుగులతో ఇషాన్‌ కిషాన్‌ అదరగొట్టాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 

గైక్వాడ్‌ సైతం మూడు సిక్సర్లతో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పాండ్యా సమయోచితంగా ఆడారు. తల ఓ చేయి వేయడంతో భారత్‌ 200 మార్క్‌ను దాటింది. శ్రేయస్ అయ్యర్ 36, పంత్ 29 పరుగులు చేశారు. చివర్లో హర్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 31 పరుగులు చేశాడు.ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా బౌలర్లలో పర్వెల్‌,పెటోరియస్,నోటర్టిజి,మహరాజ్‌ తలో వికెట్ల తీశారు. భారత ఆటగాళ్ల ధాటికి మహరాజ్‌ 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. రబడ 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చాడు.

Also read:Indian Presidential Election-2022: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే..ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా..?

Also read:IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News